Salaar: ప్రభాస్ సలార్ మూవీపై షాకింగ్ రూమర్లు.. ఏం జరిగిందంటే?

  • November 2, 2023 / 07:45 PM IST

బాహుబలి, బాహుబలి2 సినిమాలతో భారీ విజయాలను ఖాతాలో వేసుకున్న స్టార్ హీరో ప్రభాస్ తర్వాత సినిమాలతో అదే మ్యాజిక్ ను రిపీట్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారు. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ ఊహించని స్థాయిలో అంచనాలతో విడుదలై ఆ అంచనాలను పూర్తిస్థాయిలో అందుకోవడంలో ఫెయిలయ్యాయి. అయితే సలార్ మూవీతో ప్రశాంత్ నీల్ ప్రభాస్ కు కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తారని ఫ్యాన్స్ ఫీలయ్యారు. అయితే ఈ సినిమా గురించి ప్రచారంలోకి వస్తున్న రూమర్లు ఫ్యాన్స్ ను గందరగోళానికి గురి చేస్తున్నాయి.

సలార్ సినిమాలో ఒకే ఒక్క పాట ఉందని ఆ పాట కూడా ఎమోషనల్ గా ఉండనుందని గతంలో వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు మాత్రం ఈ సినిమాలో ఉన్నది ఒకే సాంగ్ అయినప్పటికీ ఆ సాంగ్ ఐటమ్ సాంగ్ అని వినిపిస్తోంది. ఈ సినిమా రెండు భాగాలు కాదని ఒక భాగమేనని మరికొన్ని రూమర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. డిసెంబర్ 22వ తేదీన సలార్ మూవీ రిలీజ్ కానుండగా ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ నిర్లక్ష్యం ఫ్యాన్స్ ను అసంతృప్తికి గురి చేస్తోంది.

సలార్ (Salaar) సినిమాకు సంబంధించి వైరల్ అవుతున్న వార్తల విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. సలార్ ట్రైలర్ రిలీజ్ డేట్ కు సంబంధించి పూర్తిస్థాయిలో స్పష్టత రావాలని మరి కొందరు అభిప్రాయాలను వ్యక్తం చేస్తుండటం గమనార్హం. సలార్ సినిమా ఊహించని స్థాయిలో హైప్ తో రిలీజ్ అవుతుండగా ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

సలార్ సినిమాతో శృతి హాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్ లకు కూడా మెమరబుల్ హిట్ గా నిలవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రభాస్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సలార్ సినిమాపై అంచనాలను మరింత పెంచాలని అభిమానులు ఫీలవుతున్నారు.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus