Balakrishna, Sridevi: జగదేక వీరుడు అతిలోక సుందరిని మించిన సినిమాను బాలయ్య అలా మిస్సయ్యారా?

  • June 29, 2023 / 08:43 PM IST

చిరంజీవి రాఘవేంద్రరావు కాంబినేషన్ లో తెరకెక్కిన జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అప్పట్లో రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించింది. ఈ సినిమాలో శ్రీదేవి హీరోయిన్ గా నటించారనే సంగతి తెలిసిందే. అయితే చిరంజీవి శ్రీదేవి కాంబినేషన్ లో పలు సినిమాలు తెరకెక్కినా బాలయ్య శ్రీదేవి కాంబినేషన్ లో మాత్రం సినిమాలు రాలేదు. అయితే వాస్తవం ఏంటంటే బాలయ్య శ్రీదేవి హీరోహీరోయిన్లుగా రాఘవేంద్ర రావు డైరెక్షన్ లో అశ్వనీదత్ నిర్మాతగా ఒక సినిమాను ప్లాన్ చేశారు.

అయితే వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయింది. స్విట్జర్లాండ్ లో ఈ సినిమా షూటింగ్ మొదలవుతున్నట్టు ప్రకటన సైతం వెలువడింది. ఈ సినిమాకు విన్సెంట్ సినిమాటోగ్రాఫర్ అని ఇళయరాజా మ్యూజిక్ అని ప్రకటన సైతం వెలువడింది. అయితే తర్వాత రోజుల్లో ఎలాంటి అప్ డేట్ రాకపోవడం వల్ల ఈ సినిమా ఆగిపోయింది. ఈ సినిమాను జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాను మించి తీయాలని మేకర్స్ భావించారట.

అయితే కథ సమస్యో, బడ్జెట్ సమస్యో తెలీదు కానీ ఈ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కలేదు. ఆ తర్వాత బాలయ్య రాఘవేంద్ర రావు కాంబినేషన్ లో పలు సినిమాలు తెరకెక్కినా బాలయ్య శ్రీదేవి కాంబినేషన్ లో మాత్రం సినిమాలు రాలేదు. (Balakrishna) బాలయ్య ప్రస్తుతం భగవంత్ కేసరి సినిమాతో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే.

ఈ సినిమా 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో తెరకెక్కుతోంది. బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. దసరా పండుగ కానుకగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సినిమా సినిమాకు బాలయ్యకు క్రేజ్ పెరుగుతుండటం గమనార్హం.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus