Kajal Rejected Movies: తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

కాజల్ అగర్వాల్.. కళ్యాణ్ రామ్ హీరోగా తేజ దర్శకత్వంలో రూపొందిన ‘లక్ష్మీ కళ్యాణం’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు కానీ.. అందులో ఆమె లుక్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో వెంటనే కృష్ణవంశీ తన ‘చందమామ’ చిత్రంలో తీసుకున్నాడు. ఆ సినిమా హిట్ అవ్వడం.. అందులోనూ ఆ సినిమాలో కాజల్ ను కృష్ణవంశీ ఓ రేంజ్ గ్లామర్ గా చూపించడంతో .. ఆమెకు ఆ సినిమా బాగా ప్లస్ అయ్యింది. అందులోనూ ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అందుకే వెంటనే రాజమౌళి ‘మగధీర’ లో నటించే ఛాన్స్ కొట్టేసింది.

ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ అవ్వడంతో కాజల్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 16 ఏళ్ళు పూర్తయినా సరే ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది కాజల్. అయితే కొన్ని కారణాల వల్ల ఆమె కొన్ని సినిమాలు రిజెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది. కొన్ని కథలు నచ్చక.. మరికొన్ని ఆమె కాల్ షీట్లు ఖాళీ లేకపోవడంతో కాజల్ రిజెక్ట్ చేసింది. ఈరోజు కాజల్ పుట్టినరోజు కావడంతో.. ఆమె రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్ ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) కృష్ణార్జున : మంచు విష్ణు హీరోగా నాగార్జున కీలక పాత్రలో పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో హీరోయిన్ గా మొదట కాజల్ ను అనుకున్నారు. కానీ కాజల్ రిజెక్ట్ చేయడంతో మమతా మోహన్ దాస్ ను తీసుకున్నారు. ఈ సినిమా ప్లాప్ అయ్యింది.

2) యమదొంగ : దర్శకుడు రాజమౌళి ఈ చిత్రంలో హీరోయిన్ గా మొదట కాజల్ ను అనుకున్నాడు. కానీ కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా కాజల్ ను తప్పించి ప్రియమణిని ఎంపిక చేసుకోవాల్సి వచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.

3) తుంగ వనం : తెలుగులో ‘చీకటి రాజ్యం’ పేరుతో వచ్చిన ఈ సినిమాలో మొదట కాజల్ ను హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఆమె నిరాకరించడంతో త్రిష ని తీసుకున్నారు. ఈ సినిమా యావరేజ్ గా ఆడింది.

4) 2015 లోనే ఉదయనిధి స్టాలిన్ హీరోగా తెరకెక్కిన ఓ మూవీలో కాజల్ కి హీరోయిన్ ఛాన్స్ దక్కింది. కానీ ఆ సినిమాకి కాజల్ నో చెప్పింది.

6) లయన్ : బాలకృష్ణ హీరోగా సత్యదేవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా కాజల్ ను అనుకున్నారు. కానీ ఆమె నో చెప్పడంతో త్రిషని ఫైనల్ చేశారు. ఈ సినిమా ప్లాప్ అయ్యింది.

7) గౌతమీపుత్ర శాతకర్ణి : బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చారిత్రాత్మక చిత్రంలో కాజల్ ను హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఆమె నో చెప్పడంతో శ్రీయని ఫైనల్ చేశారు. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది.

8) ఆచార్య : మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఈ మూవీలో కాజల్ హీరోయిన్ గా నటించింది కానీ ఆమె పార్ట్ డిలీట్ చేయడంతో.. ఆమె కెరీర్లో ఈ సినిమా ఉండీలేనట్టు అయిపోయింది. ఈ సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యింది.

9) ఘోస్ట్ : నాగార్జున హీరోగా నటించిన ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తార్ దర్శకుడు. ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ ను అనుకున్నారు. కానీ ఆమె ప్రెగ్నెంట్ కావడంతో… ఇందులో యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్కువగా ఉండటంతో ఆమె తప్పుకుంది. తర్వాత కాజల్ స్థానంలో సోనాల్ చౌహాన్ ని తీసుకున్నారు. ఈ సినిమా నిరాశపరిచింది.

10) అఖండ: బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ మూవీలో కూడా కాజల్ కి హీరోయిన్ ఛాన్స్ వచ్చింది. కానీ ఆమె నో చెప్పడంతో ప్రగ్యా జైస్వాల్ ను తీసుకున్నారు.

ఇంకా తమిళ్ లో అనేక సినిమాలని కాజల్ రిజెక్ట్ చేయడం జరిగింది. బాలీవుడ్లో కూడా ఆమె వద్దనుకున్న బద్ లా, పింక్ వంటి సినిమాల్లో తాప్సీ నటించింది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus