Vikram: విక్రమ్ కొత్త మూవీ ఆ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమా?

  • November 2, 2023 / 04:01 PM IST

కోలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాల కోసం ఎంతగానో కష్టపడే హీరోలలో విక్రమ్ ఒకరు కాగా ఈ స్టార్ హీరో రెమ్యునరేషన్ భారీ రేంజ్ లో ఉంది. అపరిచితుడు తర్వాత విక్రమ్ నటించిన సినిమాలలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నా అపరిచితుడు రేంజ్ హిట్ మాత్రం లేదు. అయితే తంగలాన్ సినిమాతో విక్రమ్ 1000 కోట్ల రూపాయల కలెక్షన్లను ఖాతాలో వేసుకోవడం ఖాయమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పొన్నియిన్ సెల్వన్ హిట్ సిరీస్ ల తర్వాత విక్రమ్ నటిస్తున్న సినిమా కావడం వల్ల కూడా ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

స్టూడియో గ్రీన్ బ్యానర్ పై పా.రంజిత్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. జీవీ ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఈ సినిమాలో విక్రమ్ రోల్ భయంకరంగా ఉండనుందని సమాచారం అందుతోంది. తన నటనతో విక్రమ్ ప్రాణం పోశారనే చెప్పాలి. ఈ సినిమాలో ఒళ్లు గగుర్పొడిచే సీన్లు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. జనవరి 26వ తేదీన రిపబ్లిక్ డే కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది.

విభిన్నమైన కథనంతో తెరకెక్కుతున్న ఈ సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కులు సైతం భారీ మొత్తానికి అమ్ముడయ్యే ఛాన్స్ అయితే ఉంది. కర్ణాటక రాష్ట్రంలోని బంగారు గనుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. చియాన్ విక్రమ్ పాత్ర కోసం కష్టపడుతున్న తీరు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ సినిమా కోసం భారీ రేంజ్ లో ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది.

రా అండ్ రస్టిక్ లుక్ లో విక్రమ్ (Vikram) అదరగొట్టారనే చెప్పాలి. జీవీ ప్రకాశ్ కుమార్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. తంగలాన్ అనగా గ్రామ కాపలాదారు అనే అర్థం వస్తుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus