విక్టరీ వెంకటేష్ హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆదర్శ కుటుంబం'(Aadarsha Kutumbam AK 47). శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో నివేదా పేతురాజ్ కీలక పాత్ర పోషించింది. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ సంస్థపై సూర్య దేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. తమన్ సంగీత దర్శకుడు. ఈ ప్రాజెక్టు అనౌన్స్ చేసిన కొత్తలో.. మంచి హైప్ ఉండేది. అయితే సినిమా అనేక సార్లు వాయిదా పడటం వల్ల.. జనాల్లో ఆసక్తి తగ్గింది.
మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపించారు. దీంతో మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. 2వ రోజు కొన్ని ఏరియాల్లో మొదటి రోజుని మించి కలెక్ట్ చేసింది. ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
| నైజాం | 5.46 cr |
| సీడెడ్ | 1.10 cr |
| ఉత్తరాంధ్ర | 1.21 cr |
| ఈస్ట్ | 0.65 cr |
| వెస్ట్ | 0.54 cr |
| కృష్ణా | 0.93 cr |
| గుంటూరు | 0.81 cr |
| నెల్లూరు | 0.49 cr |
| ఏపీ + తెలంగాణ (టోటల్) | 11.19 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 1.96 cr |
| ఓవర్సీస్ | 4.91 cr |
| టోటల్ వరల్డ్ వైడ్ | 18.06 cr (షేర్) |
‘ఆదర్శ కుటుంబం’ చిత్రానికి రూ.60 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.61 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. మరోవైపు భారీ వర్షాలు. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద 2 రోజుల్లో రూ.18.06 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా రూ.35 కోట్లు రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.42.94 కోట్లు కలెక్ట్ చేయాలి.