Cult Collections: 2వ రోజు గ్రోత్ చూపించలేకపోయిన ‘కల్ట్’

మాస్ క దాస్ విశ్వక్ సేన్ కి చాలా కాలంగా హిట్ లేదు. 2024 ఆరంభంలో వచ్చిన ‘గామి’ తర్వాత విశ్వక్ చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. ఈ ఏడాది అనుదీప్ తో చేసిన ‘ఫంకీ’ సైతం అతన్ని గట్టెక్కించలేకపోయింది. ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇవ్వాలనే ఉద్దేశంతో తన దర్శకత్వంలోనే ‘కల్ట్'(Cult) అనే సినిమా చేశాడు. ‘తారక్ సినిమాస్’ సంస్థపై సందీప్ కాకరాల ఈ చిత్రాన్ని దాదాపు రూ.25 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్స్ వంటివి చాలా వయొలెంట్ గా అనిపించాయి.

Cult

సెన్సార్ విషయంలో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంది ఈ సినిమా. ‘A’ సర్టిఫికేట్ ఇచ్చినప్పటికీ సెన్సార్ వాళ్ళు ఈ సినిమాలో చాలా సన్నివేశాలు కట్ చేశారు. ఇది ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున హాట్ టాపిక్ అయ్యింది. ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. ఈ సినిమాకి మొదటి రోజు నెగిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ కూడా సొ సొగానే నమోదయ్యాయి.2వ రోజు కూడా అనుకున్నంత గ్రోత్ చూపించలేకపోయింది. ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే  :

నైజాం  0.62 cr
సీడెడ్  0.08 cr
ఆంధ్ర(టోటల్)  0.36 cr
ఏపీ + తెలంగాణ(టోటల్)  1.06 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా  0.20 cr
ఓవర్సీస్  0.38 cr
వరల్డ్ వైడ్(టోటల్)   1.64 cr(షేర్)

‘కల్ట్’ సినిమాకి రూ.8 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.8.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 2 రోజుల్లో ఈ సినిమాకి కేవలం రూ.1.64 కోట్ల షేర్ నమోదైంది. గ్రాస్ పరంగా రూ.3.1 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.6.86 కోట్లు కలెక్ట్ చేయాల్సి ఉంది.

 క్లీన్ హిట్స్ లిస్ట్ లో చేరిన ‘రణబాలి’

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus