Aadarsha Kutumbam AK 47: సైలెంట్ గా బ్లాక్ బస్టర్ కొట్టేస్తుందా?

విక్టరీ వెంకటేష్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘ఆదర్శ కుటుంబం AK47′(Aadarsha Kutumbam AK 47) సినిమా రూపొందింది. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీనిధి శెట్టి వెంకటేష్‌కి జోడీగా నటించింది. అనేకసార్లు వాయిదా పడిన ఈ సినిమా.. ఎట్టకేలకు అక్టోబర్ 30న విడుదల కాబోతోంది. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా యు/ఎ రేటింగ్ పొందింది.

Aadarsha Kutumbam AK 47

అయితే టీజర్, ట్రైలర్ వంటివి పర్వాలేదనిపించినప్పటికీ.. అనుకున్న స్థాయిలో బజ్ అయితే క్రియేట్ చేయలేకపోయాయని చెప్పాలి. తమన్ సంగీతంలో రూపొందిన సాంగ్స్ కూడా అంతగా అలరించలేదు. ఆ విషయాలు పక్కన పెడితే.. ‘ఆదర్శ కుటుంబం AK47’ చిత్రాన్ని ఇటీవల నిర్మాతలు ఇండస్ట్రీకి చెందిన కొంతమంది పెద్దలకు, సన్నిహితులకు స్పెషల్ షో వేసి చూపించారు. సినిమా చూసిన అనంతరం వారు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

వారి సమాచారం ప్రకారం.. ‘ఆదర్శ కుటుంబం AK47’ సినిమా 2 గంటల 29 నిమిషాల నిడివి కలిగి ఉందట. స్వర్ణ (శ్రీనిధి శెట్టి) చిట్ ఫండ్ కంపెనీలో డబ్బులు పెట్టి మోసపోవడంతో.. ఆమె ఫ్యామిలీ అప్పుల పాలవుతుంది. అవి తీర్చడం కోసం స్వర్ణ భర్త చిట్టిబాబు (వెంకటేష్) ఉద్యోగం చేస్తుంటాడు. ఒకానొక సమయంలో అతని ఉద్యోగం కూదా పోతుంది. ఆర్థిక సమస్యలు మరింతగా పెరిగిపోతాయి. అయితే అధృష్టవశాత్తు అతనికి లాటరీ తగలడంతో.. వచ్చిన డబ్బుతో ఓ లగ్జరీ ఇంట్లోకి షిఫ్ట్ అవుతుంది చిట్టిబాబు ఫ్యామిలీ.

ఆ ఇంట్లోకి వెళ్లాక అనుకోకుండా వారు ఓ క్రైమ్‌లో చిక్కుకుంటారు. ఆ సమస్యల నుండి వారు ఎలా బయటపడ్డారు? చిట్టిబాబు జైలుకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది.. అతని గతం ఏంటి? సంపూర్ణ (యువినా పార్థవి) చిట్టిబాబు, స్వర్ణల సొంత కూతురేనా? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగిలిన సినిమా అంటున్నారు. ‘ఆదర్శ కుటుంబం AK47’ ఫస్ట్ హాఫ్ చాలా రేసీగా ఉంటుందట. వెంకటేష్, శ్రీనిధి శెట్టి మధ్య వచ్చే సన్నివేశాలు, పంచ్ డైలాగులు ఫన్నీగా ఉంటాయట.

కొన్ని సన్నివేశాలు చాలా రిలేటబుల్‌గా ఉంటాయట. ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ నుండి సినిమా పరుగులు పెడుతుందంటున్నారు. ఇంటర్వెల్ బ్లాక్ వద్ద యాక్షన్ సీన్ హై ఇస్తుందట. సెకండాఫ్‌లో వచ్చే క్రైమ్ ఎపిసోడ్స్, సత్య క్యారెక్టరైజేషన్‌తో పాటు కొన్ని ట్విస్టులు అలరిస్తాయంటున్నారు. త్రివిక్రమ్ మార్క్ డైలాగులు కూడా బాగా పేలాయంటున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్‌కి మాత్రమే కాదు, అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసే ఎలిమెంట్స్ ‘ఆదర్శ కుటుంబం AK47’లో చాలా ఉన్నాయంటున్నారు. చూడాలి మరి!

‘ప్యారడైజ్‌’ సినిమా పరువు తీసేసిన గౌతమ్‌ ఘట్టమనేని.. రేటింగ్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus