Aamir Khan: 60లో ఆమిర్ ఖాన్ న్యూ గర్ల్ ఫ్రెండ్.. కత్రినా కంటే అందంగా..!

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ (Aamir Khan) మరోసారి ప్రేమలో పడ్డారని ఇప్పటికే చాలా వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే, ఈసారి విషయాన్ని తనే స్వయంగా ధ్రువీకరించడంతో బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తన 60వ పుట్టినరోజున జరిగిన ప్రైవేట్ మీడియా సమావేశంలో ఆమిర్ ఖాన్ గౌరీ స్ప్రాట్ అనే మహిళను తన గర్ల్‌ఫ్రెండ్‌గా పరిచయం చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. గత కొన్ని నెలలుగా గౌరీతో రిలేషన్‌లో ఉన్నట్లు తానే స్వయంగా వెల్లడించడంతో, బాలీవుడ్ వర్గాల్లో ఈ విషయం మీద చర్చ మిన్నంటుతోంది.

Aamir Khan

తన మొదటి భార్య రీనా దత్తా, రెండో భార్య కిరణ్ రావుల నుంచి విడిపోయిన తర్వాత ఆమిర్ మళ్లీ ప్రేమలో పడతారని ఎవరూ ఊహించలేదు. కానీ 18 నెలలుగా గౌరీతో రిలేషన్‌లో ఉన్నానని చెప్పిన ఆయన, ఆమెకు ఇప్పటికే ఆరేళ్ల కుమారుడు ఉన్నాడని కూడా వెల్లడించారు. మరింత ఆసక్తికరంగా, గౌరీని తన పిల్లలు జునైద్, ఇరా ఖాన్ కలవడంతో పాటు, వాళ్లిద్దరూ ఆమెతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. అయితే పెళ్లి ఎప్పుడన్నదానిపై స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా, మా రిలేషన్‌షిప్ చాలా స్ట్రాంగ్ అంటూ సమాధానం ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆమిర్ మాట్లాడుతూ, నా గర్ల్‌ఫ్రెండ్ కత్రినా కైఫ్ కంటే అందంగా ఉంటుంది. ఆమెతో ఉన్నప్పుడు నాకెప్పుడూ ఇంట్లో ఉన్న అనుభూతి కలుగుతుంది అని చెప్పడం, బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్ స్టార్ల ప్రేమ వ్యవహారాలు ఎప్పుడూ చర్చనీయాంశమే కానీ, 60 ఏళ్ల వయసులో మళ్లీ ప్రేమలో పడటం, కొత్త జీవితాన్ని స్వీకరించడం అరుదైన విషయం.

అంతేకాదు, ‘‘భువన్‌కు అతని గౌరీ లభించింది’’ అంటూ తన లగాన్ సినిమా డైలాగ్‌ను ప్రస్తావించడంతో, ఈ ప్రకటన మరింత వైరల్ అయింది. ఇప్పటికే గౌరీ తన వృత్తిపరమైన బాధ్యతల కారణంగా బెంగళూరు నుంచి ముంబైకి మారిపోయిందని సమాచారం. 25 సంవత్సరాల క్రితం తాను ఆమెను కలిశానని, ఆ తరువాత కొంత గ్యాప్ వచ్చిందని, ఇప్పుడు మళ్లీ కలిసి ప్రేమలో పడ్డామని వెల్లడించడం ఆసక్తికరంగా మారింది.

తెలుగు మార్కెట్ పై పట్టు విడువని సూర్య.. ఈసారి బిగ్ ప్లాన్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus