తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) తన లేటెస్ట్ సినిమా రెట్రోతో భారీ అంచనాలు పెంచాడు. కంగువ (Kanguva) నిరాశపరిచిన తర్వాత, ఈ సినిమాతో మళ్లీ ఫుల్ స్వింగ్‌లోకి రావాలని చూస్తున్నాడు. కార్తీక్ సుబ్బరాజ్ (Karthik Subbaraj) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్‌గా నటిస్తోంది. వింటేజ్ లుక్, స్టైలిష్ ట్రీట్మెంట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం అభిమానులకు కొత్త అనుభూతిని అందించనుంది. ఇటీవల విడుదలైన గ్లింప్స్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈసారి సూర్య తెలుగులోనూ తన మార్కెట్‌ను మరింత బలోపేతం చేసేందుకు సీరియస్‌గా ప్లాన్ చేస్తున్నాడు.
గతంలో గజిని, సింగం వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ, ఇటీవల ఆయన సినిమాలు తెలుగులో ఆశించిన స్థాయి ఫలితాలు ఇవ్వలేదు. అందుకే, రెట్రో సినిమాను స్ట్రైట్ తెలుగు సినిమాలా ఫీల్ వచ్చేలా రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. తెలుగు హక్కులను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కొనుగోలు చేయడంతో, తెలుగులో భారీ ప్రమోషన్లతో ముందుకు వెళ్ళబోతున్నారు. వరుస ఇంటర్వ్యూలు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ప్లాన్ చేశారు. కంగువా టైమ్ లోనే భారీగా ప్రమోషన్ చేసిన సూర్య తెలుగులో కూడా ఆ సినిమాతో డిజాస్టర్ చూశాడు.
ఇక ఇప్పుడు మళ్లీ తెలుగు మార్కెట్ పై పట్టు సాధించేలా ప్లాన్ చేస్తున్నారు. సినిమాలో మాస్ మరియు క్లాస్ అంశాలు సమపాళ్లలో ఉంటాయని సమాచారం. కార్తీక్ సుబ్బరాజ్ టేకింగ్, సంతోష్ నారాయణ్ (Santhosh Narayanan) సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణలుగా నిలవనున్నాయి. ఇందులో సూర్య పాత్ర దృఢమైన క్యారెక్టర్ ఆర్క్ కలిగినట్లు తెలుస్తోంది. గతంలో మాస్ సినిమాలకు దూరంగా ఉన్న సూర్య, ఇప్పుడు రెట్రో (Retro) ద్వారా ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా స్క్రిప్ట్ డిజైన్ చేసుకున్నట్లు సమాచారం.
ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ కానుండటంతో, ప్రమోషన్ స్ట్రాటజీ కూడా విభిన్నంగా ఉండనుంది. తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. సూర్యకు బాలీవుడ్‌లో కూడా మంచి క్రేజ్ ఉన్న నేపథ్యంలో, ఇది ఆయన కెరీర్‌కు కీలకమైన సినిమా కానుంది. ప్రస్తుతం షూటింగ్ పూర్తి కావచ్చిందని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని టాక్. మొత్తానికి, రెట్రో సినిమాతో సూర్య మళ్లీ మాస్ ఆడియన్స్‌కు దగ్గరవ్వాలని చూస్తున్నాడు. మే 1న విడుదల కాబోతున్న ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.