Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

గత కొన్ని రోజులుగా టాలీవుడ్ జనాల సోషల్‌ మీడియాలో ఓ అమ్మాయి గురించి పెద్ద ఎత్తున మాట్లాడుకుంటున్నారు. ఆమె షేర్‌ చేస్తున్న ఫొటోలు కూడా అలా మాట్లాడుకునేలానే ఉన్నాయి కూడా. అలా అని ఆమె హీరోయిన్‌ కుమార్తె కాదు, హీరో కుమార్తె కూడా కాదు. ఆమె ఒకప్పటి స్టార్‌ డైరక్టర్‌ కుమార్తె. ఆమెనే ఆనంది వైట్ల. ఇంటి పేరు చూశాక ఆమె ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది. అవును దర్శకుడు శ్రీను వైట్ల కుమార్తె గురించే ఇదంతా.

Aanandi Vaitla

శ్రీను వైట్ల ఆయన పెద్దమ్మాయి ఆనంది వైట్ల సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె షేర్ చేస్తున్న ఫొటోలు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. హైదరాబాద్‌లో చదువు పూర్తి చేసుకున్న ఆనంది ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లింది. ప్రస్తుతం లాస్ ఏంజిలెస్‌లో ఉంటున్న ఈమె, అప్పుడప్పుడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలు షేర్‌ చేస్తూ వచ్చింది. అయితే ఇటీవల బ్లాక్ కలర్ ట్రాన్స్‌పరెంట్ డ్రెస్‌లో దిగిన కొన్ని ఫొటోలు సోషల్‌ మీడియాలో షేర్‌చేసింది.

దర్శకుల కుటుంబాల అమ్మాయిలు సింపుల్‌గా ఉంటారు. కానీ ఆనంది ఇలా సోషల్‌ మీడియాలో ఫొటోలు పెట్టేసరికి.. హీరోయిన్‌ అవ్వాలని అనుకుంటుందేమో అనే చర్చ మొదలైంది. ఈ ఫొటోల ద్వారా సోషల్‌ మీడియాలో తొలుత వైరల్‌ అయ్యి.. ఆ తర్వాత మోడలింగ్ అటు నుండి యాక్టింగ్ వైపు వచ్చే అమ్మాయిలు ఉన్న రోజుల్లో ఆమె ఫొటోలు కూడా అందుకేనేమో అనే చర్చ నడుస్తోంది. ఆనంది ఫొటోలు చూసినప్పుడు.. స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది అనే కామెంట్లు కనిపిస్తున్నాయి.

మరి ఆనంది మనసులో ఏముందో ఆమెనే చెప్పాలి. ఆనంది తల్లి రూపా వైట్ల కూడా సినిమాలతో పరిచయం ఉన్నవారే. ఆమె కొన్ని సినిమాలకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా చేశారు. ఈ లెక్కన ఫ్యామిలీకి సినిమా ఇంకా బాగా దగ్గర అని చెప్పాలి. ఈ లెక్కన ఆనంది సినిమాల్లోకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags