బిగ్ బాస్ 4: టాస్క్ లో ఏం జరిగింది..?

  • December 5, 2020 / 03:28 PM IST

బిగ్ బాస్ హౌస్ లో అభిజిత్ ఇంజ్యూర్ అయ్యాడా..? ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. బిగ్ బాస్ లీక్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఎపిసోడ్ కంటే కూడా ముందుగానే వచ్చేస్తుంటాయి. ఇది మనందరికీ తెలిసిందే. దీనిని బట్టే ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరగబోతోంది అనేది లీక్ అయ్యింది. ఇందులో భాగంగా అభిజిత్ కి లగ్జరీబడ్జెట్ టాస్క్ లో చిన్న చిన్న దెబ్బలు తగిలాయని న్యూస్ బయటకి వచ్చింది.

బిగ్ బాస్ హౌస లో ఈవారం టిక్కెట్ టు ఫినాలే రేస్ పైనే ఎక్కువగా ఎపిసోడ్స్ ని కట్ చేశారు. దీంతో లగ్జరీ బడ్జెట్ టాస్క్ అనేది జరగలేదు. మ్యాగ్జిమమ్ వీకెండ్స్ మనం చూసినట్లయితే, కుకింగ్ టాస్క్ లు, అలాగే స్పాన్సర్ టాస్క్ లు ఇస్తూ ఉంటారు. అయితే, ఈసారి రెండు గ్రూప్స్ గా విడిపోయి లగ్జరీ బడ్జెట్ టాస్క్ ని చేశారు హౌస్ మేట్స్ అందరూ. ఇందులో అఖిల్ టీమ్, అభిజిత్ టీమ్ పోటీ పడ్డాయి. సోహైల్ సంచాలక్ గా ఉన్న ఈ టాస్క్ లో ఐటమ్స్ ని కలక్ట్ చేయడానికి వెళ్లిన అభిజిత్ కి చిన్న చిన్న దెబ్బలు తగిలినట్లుగా టాక్ వినిపిస్తోంది.

అభిజిత్, అరియానా , అవినాష్ ఒక టీమ్ గా ఉంటే, అఖిల్ , హారిక, మోనాల్ ఇంకో టీమ్ లో ఉన్నారు. దీనికి జడ్జిగా సోహైల్ ఉన్నాడు. ఈ టాస్క్ లో చిన్న చిన్న బాక్స్ లలో లగ్జరీ బడ్జెట్ ఐటమ్స్ ని కలక్ట్ చేసే ప్రోసెస్ లో అభిజిత్ వెళ్లడం, దానివల్ల దెబ్బలు తగలడం జరిగిందని న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మరి ఎలాంటి గాయాలు అయ్యాయి అనేది ఎపిసోడ్ చూస్తేనే కానీ తెలీదు. అదీ మేటర్.

[yop_poll id=”1″]
Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus