బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!

  • November 28, 2020 / 05:53 PM IST

సినిమాల్లో పారితోషికం అంటే మొదట హీరోల గురించి, ఆ తర్వాత హీరోయిన్ల గురించి మాట్లాడుకుంటాం. కానీ మన సినిమాల్లో స్టార్ కమెడియన్లు ఎంత తీసుకుంటున్నారో దాదాపు ఎప్పుడూ చర్చకు రాదు. సినిమాలో ప్రధాన పాత్రల తర్వాత ఆడియన్స్ ను కదలకుండా కూర్చోబెట్టగలిగేది కమెడియన్లే. అందుకు జనాన్ని నవ్వించగలిగే వారికి చాలా డిమాండ్. మరి మన కమెడియన్లు ఎవరెవరు రోజుకు ఎంత తీసుకుంటుంటారో ఒకసారి చూద్దామా..

1.బ్రహ్మానందం

స్టార్లలో మెగాస్టార్ ఉన్నట్లుగా.. కమెడియన్లకు మెగాస్టార్ అన్న బిరుదు ఉంటే అది బ్రహ్మానందంకే వెళ్తుంది. ఆయన కామెడీతోనే సినిమాలు ఆడిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. స్క్రీన్ మీద ఆయన కనిపిస్తే చాలని సినిమా వాళ్లు అనుకునే సందర్భాలు కూడా బోలెడు. మరి బ్రహ్మీ రోజుకు తీసుకునే పారితీషికం ఎంతో తెలుసా..? అక్షరాలా రూ. 5లక్షలు.

2. అలీ

అలీ కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెరపై ఆయన తన ప్రత్యేకమైన మేనరిజంతో చేసే అల్లరి, ప్రేక్షకులకు ఎంతలా నవ్వు తెప్పిస్తుందన్నది సీతాకోకచిలుక సినిమా నుంచీ చూస్తూనే ఉన్నాం. సినిమాల కోసం చెన్నై వచ్చేసి ఎన్నో కష్టాలు పడిన అలీ.. నేడు ఒకరోజుకు తీసుకునే పారితీషికం సుమారు మూడున్నర లక్షల పైమాటే.

3. వెన్నెల కిషోర్

సునీల్ హీరో పాత్రలకు వెళ్లిపోయిన తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేశారు కమెడియన్ వెన్నెల కిషోర్. ఆయన ఒక్క సినిమాకు రూ. 3లక్షల వరకూ తీసుకుంటారు.

4. పృథ్వీ రాజ్

అప్పుడెప్పుడూ ఆ ఒక్కటీ అడక్కు సినిమా నుంచీ ఇండస్ట్రీలో ఉన్న 30 ఇయర్స్ పృథ్వీకి ఖడ్గంలోని 30 ఇయర్స్ డైలాగ్ మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వరసగా సినిమాలు చేసుకుంటూ అగ్ర కమెడియన్లలో ఒకరిగా ఎదిగారు. ఆయన రోజుకు రూ. 2లక్షల వరకూ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

5. సప్తగిరి

పరుగులో సైడ్ క్యారెక్టర్ లో సీరియస్ గా కనిపించిన సప్తగిరి దశ, వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో తిరిగింది. ఆ తర్వాత మనోడు వెనుదిరిగి చూసుకోలేదు. తనదైన స్టైల్ లో కామెడీ చేస్తూ హీరో కూడా అయిపోయాడు. ఆయన రోజుకు రూ. 2లక్షల వరకూ తీసుకుంటారని ఫిల్మ్ నగర్ లో చెబుతారు.

6. రాహుల్ రామకృష్ణ

అర్జున్ రెడ్డి, భరత్ అనే నేను సినిమాలతో క్యారెక్టర్ ఆర్టిస్టు కమ్ కమెడియన్ గా మంచిపేరు సంపాదించుకున్న రాహుల్ రామకృష్ణ ఈ జనరేషన్ కు ఇష్టమైన కమెడియన్లలో ఒకరు. ఆయన రోజుకు రూ. 2లక్షలు తీసుకుంటారని తెలుస్తోంది.

7. శ్రీనివాస రెడ్డి

శ్రీనివాస రెడ్డి గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. స్క్రీన్ పై చోటు దొరికితే చాలు, తనదైన టైమింగ్ తో దూసుకెళ్లిపోతారాయన. మధ్యలో కొన్ని సినిమాలు హీరోగా కూడా ప్రయత్నించారు. ఆయన రోజుకు రూ. 2లక్షలు తీసుకుంటారని తెలుస్తోంది.

8. సునీల్

ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా ఒక వెలుగు వెలిగిన సునీల్, ఆ తర్వాత హీరోగా టర్న్ తీసుకోవడంతో కమెడియన్ గ్రాఫ్ ను కోల్పోయారు. ఇప్పుడిప్పుడే ఆయన మళ్లీ కమెడియన్ గా సెటిలవడానికి ట్రై చేస్తున్నారు. మధ్య మధ్యలో డిస్కో రాజా, కలర్ ఫొటో వంటి సినిమాల ద్వారా విలన్ షేడ్ పాత్రలు పోషిస్తున్నారు. సునీల్ ప్రస్తుతం రోజుకు రూ. 4లక్షల వరకూ తీసుకుంటున్నట్లు అంచనా.

9. ప్రియదర్శి

పెళ్లి చూపులు సినిమాతో స్టార్ కమెడియన్ గా క్లిక్ అయిపోయాడు ప్రియదర్శి. ఆ తర్వాత ఆయన నటించిన తొలిప్రేమ, బ్రోచేవారెవరురా, ఎఫ్ 2, స్పైడర్ వంటి ఎన్నో సినిమాల్లో మంచి పాత్రలు దక్కించుకుని ప్రేక్షకుల్ని అలరిస్తూ వస్తున్నాడు. మల్లేశం అనే సినిమాలో తనలోని నటుడిని కూడా నిరూపించుకోగలిగాడు. ప్రస్తుతం దర్శి రోజుకు రూ. 2 లక్షల వరకూ తీసుకుంటున్నాడని టాక్.

10. పోసాని కృష్ణమురళి

ఏంటి రాజా అంటూ పోసాని స్టైల్ డైలాగ్ ఎంత ఫ్యామస్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ డైలాగ్ లాగే ఆయన కూడా తన కామెడీ టైమింగ్ తో స్టార్ కమెడియన్లలో ఒకరిగా చేరారు. ప్రస్తుతం రోజుకు రూ. రెండున్నర లక్షల వరకూ ఆయన పారితోషికం తీసుకుంటున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus