సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా హీరో హీరోయిన్లకు అభిమానులు ఉంటారు. అయితే సినిమాలలో నటించే వారందరూ కూడా ఆర్టిస్టులు అయినప్పటికీ వీరికి మాత్రమే ఎక్కువ ఫాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఇక విలన్ పాత్రల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోలను ఎంతగా అభిమానిస్తారో విలన్లను అంతగా ద్వేషిస్తారు అనే విషయం మనకు తెలిసిందే. అయితే కొన్ని సినిమాలలో విలన్లు చాలా క్రూరంగా కనిపిస్తూ ఉంటారు. ఈ విధంగా సినిమాలలో పాత్ర కోసం వారిని అలా చూపిస్తారే కానీ నిజజీవితంలో మాత్రం వాళ్లు చాలా మంచి వాళ్ళనే చెప్పాలి.
అయితే నిజజీవితంలో ఎంతో మంచిగా ఉన్నటువంటి వారు తెరపై విలన్ పాత్రలో నటించడం వల్ల నిజ జీవితంలో కూడా వారిని విలన్లుగానే భావిస్తాము వారిని మనం చూసే దృష్టి కూడా అలాగే ఉంటుంది. అయితే ఇలా ఎంతోమంది విలన్లు పలుసార్లు తమ బాధలను చెప్పుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో విలన్ గా కోటా శ్రీనివాసరావు ఎన్నో సినిమాలలో నటించారు. అయితే ఆయన నటనకు బయట కూడా ఆడవాళ్లు తనని చూసి దూరంగా వెళ్లే వారిని పలుసార్లు చెప్పుకొచ్చారు.
అయితే తాజాగా నటుడు (Ashish Vidyarthi) ఆశిష్ విద్యార్థి కూడా విలన్ పాత్రల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా ఆశిష్ విద్యార్థి మాట్లాడుతూ తాను సినిమాలలో విలన్ పాత్రలలో నటించడం వల్ల చాలా ఇబ్బంది పడ్డానని తెలిపారు. సినిమాలలో విలన్ పాత్రలలో నటించడం వల్ల ఎన్నో నెగటివ్ కామెంట్స్ ఎదుర్కోవలసి ఉంటుంది.ఇక నేను చేసిన పాత్రల గురించి మాట్లాడాలంటే కొన్నిసార్లు నాకే సిగ్గు అనిపిస్తుందని ఈ సందర్భంగా ఈయన తెలియజేశారు.
ఎందుకంటే విలన్లు హీరోలు మాదిరిగా నటనను గొప్పగా చెప్పుకోలేరు కదా అంటూ ఈయన తెలియజేశారు.ఏది ఏమైనా సినిమాలలో నేను నటించిన పాత్రలు నా జీవితంపై చాలా ప్రభావం చూపాయి అంటూ ఈ సందర్భంగా ఆశిష్ విద్యార్థి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్