Shaitan Review in Telugu: ‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • రిషి, రవి కాలే (Hero)
  • షెల్లీ (Heroine)
  • దేవయాని శర్మ, జాఫర్ సాదిక్, నితిన్ ప్రసన్న, కామాక్షీ భాస్కర్ల (Cast)
  • మహి వి రాఘవ్ (Director)
  • మహి వి రాఘవ్, చిన్నా వాసుదేవ్ రెడ్డి (Producer)
  • శ్రీరామ్ మద్దూరి (Music)
  • షణ్ముగ సుందరం (Cinematography)
  • Release Date : జూన్ 15, 2023

వెబ్ సిరీస్ అంటేనే ప్రేక్షకుల్లో ఓ ప్రత్యేకమైన ఫీలింగ్ ఏర్పడింది. ఇక్కడ సెన్సార్ అనేది ఉండదు కాబట్టి.. బోల్డ్ అనే పదాన్ని అడ్డుపెట్టుకుని కుటుంబంతో చూడకూడని, చూడలేని వెబ్ సిరీస్ లు రూపొందిస్తున్నారు మేకర్స్ అని జనాలు భావిస్తున్నారు. ‘సైతాన్’ కూడా అలాంటి వెబ్ సిరీసే అయ్యుంటుంది అని ట్రైలర్ తోనే ఓ అంచనాకి వచ్చేసారు. ఇటీవల విడుదలైన ‘సైతాన్’ ట్రైలర్ అందరికీ పెద్ద షాకిచ్చింది అనే చెప్పాలి. ట్రైలర్ నిండా బూతులు, మితిమీరిన వయొలెన్స్ ఉండడంతో.. ఈ సిరీస్ కి పబ్లిసిటీ బాగా జరిగింది అని చెప్పాలి. మరి ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో.. ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకుందో తెలుసుకుందాం రండి :

కథ: ముగ్గురు పిల్లల తల్లి అయిన సావిత్రి (షెల్లీ నబు కుమార్) ను ఆమె భర్త వదిలేసి వెళ్ళిపోతాడు. దీంతో ఆమె పిల్లలను పెంచడానికి చాలా కష్టాలు పడుతుంది. ఆమె పిల్లలు బాలి (రిషి), జయ (దేవయాని శర్మ), గుమ్తి (జాఫర్ సాధిక్).వీళ్ళను పెంచడానికి ఇబ్బంది పడుతున్న టైంలో ఓ పోలీసుకు ఉంపుడుగత్తె కావాల్సి వస్తుంది.ఈ క్రమంలో ఆమె గురించి చుట్టు పక్కనున్న వాళ్ళు చాలా రకాలుగా మాట్లాడుకుంటారు. అయినా ఆమె పెద్ద కొడుకు బాలి ఆ అవమానాలు భరిస్తాడు. అయితే తల్లి కోసం వచ్చే పోలీస్ కన్ను ఓసారి బాలి చెల్లి పై పడుతుంది. దీంతో అతను ఆ పోలీస్ తల తెగ నరుకుతాడు. దీంతో అతని పై కేసు ఫైల్ అవుతుంది. ఆ కేసులో అతను జైలుకి వెళ్తాడు. ఆ తర్వాత కూడా అతను అనేక మందిని చంపి దళంలోకి చేరాల్సి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగిలిన కథ.

నటీనటుల పనితీరు: నటీనటులు పెద్దగా పాపులర్ అయిన వాళ్ళు కాదు. కానీ అందరూ బాగా చేశారనే చెప్పాలి. బాలి పాత్రకి రిషి న్యాయం చేశాడు. అన్ని రకాల ఎక్స్ప్రెషన్స్ ను చాలా బాగా పలికించాడు. ‘సేవ్ ద టైగర్స్’లో చైతన్య కృష్ణకి జోడీగా, లాయర్ పాత్రలో.. ఓ కోపిష్టి భార్యగా చేసిన దేవయాని.. ఈ చిత్రంలో జయప్రద పాత్రలో కూడా అలాగే నటించింది. కాకపోతే డీ గ్లామర్ లుక్‌లో శృంగా* సన్నివేశాల్లో కూడా బోల్డ్ గా నటించింది.హత్యలు చేసే సమయంలో కూడా ఈమెను చూస్తే.. భవిష్యత్తులో ఈమెకు అన్నీ నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్రలే వస్తాయేమో అనిపించొచ్చు. జాఫర్ కూడా తన పాత్రకి న్యాయం చేశాడు. కామాక్షీ భాస్కర్ల, షెల్లీ, రవి కాలే కూడా తమ పాత్రలకి తగ్గట్టు నటించి మెప్పించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు: దర్శకుడు మహి వి రాఘవ్ గురించి చెప్పుకోవాలి అంటే ‘సైతాన్’ కి ముందు.. ‘సైతాన్’ కి తర్వాత అని చెప్పుకోవాలేమో. ఎందుకంటే ఇప్పటివరకు అతను తీసిన సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకునే తీశాడు. ‘సేవ్ ది టైగర్స్’ వెబ్ సిరీస్ లో బూతులు పెట్టినా.. అవి సిట్యుయేషన్ కి తగ్గట్టుగానే ఉన్నాయేమో అనిపిస్తుంది. కానీ ‘సైతాన్’ విషయంలో అతను.. ఇప్పటివరకు పెట్టుకున్న హద్దులు అన్నీ దాటేశాడు అనిపిస్తుంది. ‘దండుపాళ్యం’ సిరీస్ లు(మూవీ పార్టులు) ఇతను ఎన్నో సార్లు చూసి ఈ కథ రాసుకున్నాడేమో అనిపిస్తుంది. అక్కడక్కడ రాంగోపాల్ వర్మ టేకింగ్ కూడా గుర్తుకొస్తుంది. 9 ఎపిసోడ్స్ లో మొదటి మూడు పర్వాలేదు అనిపించినా.. తర్వాత వాటి స్థాయిలో అయితే ఉండదు. ఎమోషనల్ కనెక్టివిటీ తర్వాత మిస్ అవ్వడమే అందుకు కారణం అని చెప్పాలి. శ్రీరామ్ మద్దూరి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలకి తగ్గట్టుగా ఉంటుంది. షణ్ముగ సుందరం సినిమాటోగ్రఫీ బాగుంది. ఆర్ట్ వర్క్ కూడా బాగానే ఉంది. జైలు సన్నివేశాలు బాగా రావడానికి కారణం అదే.

విశ్లేషణ: మహి వి రాఘవ్ తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోడానికి తీసిన సిరీస్ లా ఉంది సైతాన్. మొదటి మూడు ఎపిసోడ్స్ ఆసక్తి పెంచినా.. ఆ తర్వాతి ఎపిసోడ్స్ ఆ స్థాయిలో లేవు.

రేటింగ్ : 2.5/5

Click Here To Read in TELUGU

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus