పాత సినిమాల్లో కొన్ని సన్నివేశాలు ఎంత రొటీన్ గా ఉండేవో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా రివెంజ్ డ్రామాలలో విలన్స్ అనగానే ఒక రేపిస్ట్ గా ముద్ర వేయడం చాలాసార్లు జరిగింది. ఇక ఒక నటుడు అయితే అలాంటి సన్నివేశాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. అతను మరెవరో కాదు చలపతిరావు. దర్శకుడు రవిబాబు ఈ నటుడి కుమారుడే. ఇక చలపతిరావు ఉన్నారంటే ఆ సినిమాలో ఎదో ఒక రేప్ సీన్ ఉండే ఉంటుంది
అనేంతల క్రేజ్ అందుకున్న చలపతిరావు దాదాపు 1500 సినిమాల్లో నటించారు. ఇక అందులో రేప్ సీన్స్ 94 ఉన్నాయట. విలనిజాన్ని చూపిస్తూ రేప్ సేన్ లో క్రూరంగా నటించడంతో సీన్ బాగా పండేదట. దీంతో దర్శకులు ఏరికోరి మరి ఎంచుకునేవారని అప్పట్లో టాక్ వచ్చేది. ఇక మెల్లిగా సినిమా ట్రెండ్ మారడంతో ఆయన కూడా పాత్రల ఎంపిక విధానాన్ని మార్చుకున్నారు. ప్రస్తుతం ఏడు పదుల వయసులో ఉన్న చలపతిరావు ఎక్కువగా సపోర్టింగ్ రోల్స్ కామెడీ రోల్స్ తోనే దర్శనమిస్తున్నారు.
ఇక ఆయన తనయుడు రవిబాబు ఒకప్పుడు విలన్ గా కమెడియన్ గా నటించిన విషయం తెలిసిందే. అలాగే అల్లరి, అమరావతి, అవును వంటి ప్రయోగాత్మక సినిమాలతో దర్శకుడిగా కూడా మంచి క్రేజ్ అందుకున్నాడు.
Most Recommended Video
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!