Actor Giribabu: సీనియర్ నటుడు గిరిబాబు మృతి!

తెలుగు చలనచిత్ర రంగంలో సుదీర్ఘకాలం పాటు తన అద్భుత నటనతో ప్రేక్షకులను అలరించిన సీనియర్ నటుడు గిరిబాబు ఈరోజు కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇటీవల పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని కొండాపూర్‌ సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఓ దశలో కోలుకున్నట్టు కనిపించినా.. మళ్ళీ పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఈరోజు అనగా శనివారం నాడు కన్నుమూశారు. గిరిబాబు వయసు 80 ఏళ్ళు కావడం గమనార్హం. ప్రస్తుతం గిరిబాబు పార్థీవ దేహం కిమ్స్ హాస్పిటల్లో ఉంది. తర్వాత ఫిలిం ఛాంబర్లో సందర్శనార్ధం సాయంత్రం 6 గంటల నుండీ 8 గంటల వరకు ఉంచుతారట.

Giribabu

1946 జూన్ 8వ తేదీన ప్రకాశం జిల్లా, కొరిశపాడు మండలంలోని రావినూతల గ్రామంలో జన్మించారు గిరిబాబు. ‘జగమే మాయ’ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఆయన… ఒకే తరహా పాత్రలకు పరిమితం కాకుండా.. కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా (విలన్), అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అనేక విభిన్నమైన పాత్రలు పోషించి విలక్షణ నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును పొందారు. తర్వాత నిర్మాతగా కూడా మారి ‘సింహ గర్జన’, ‘మెరుపుదాడి’, ‘ఇంద్రజిత్’ తదితర చిత్రాలు నిర్మించారు. అంతటితో అయిపోలేదు మెగాఫోన్ పట్టి ‘రణరంగం’, ‘ఇంద్రజిత్’, ‘నీ సుఖమే నే కోరుకున్నా’ వంటి పలు చిత్రాలకు దర్శకత్వం వహించి బహుముఖ ప్రజ్ఞాశాలి అనిపించుకున్నారు.

గిరిబాబుకి ఇద్దరు కుమారులు. ఒకరు సీనియర్ నటుడు రఘుబాబు, ఇంకొకరు బోసుబాబు. వీరిలో రఘుబాబు కొన్ని వందల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశారు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నాడు.బోసుబాబు మాత్రం హీరోగా ఒకటి, రెండు సినిమాల్లో నటించి నటనకు గుడ్ బై చెప్పారు. 2023లో విడుదలైన ‘అన్నీ మంచి శకునములే’ గిరిబాబు నటించిన ఆఖరి చిత్రం కావడం గమనార్హం.

క్లారిటీ ఇచ్చి.. వివాదాలపై మరింత కన్‌ఫ్యూజ్‌ చేసిన ‘ఇడుపు కాయితం’ నిర్మాత

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus