Maniesh Paul: నీ డెడికేషన్ కి హ్యాట్సాఫ్..పాత్ర కోసం ప్రాణాల సైతం లెక్కచేయని నటుడు మనీష్ పాల్

స్టార్ హీరోలు మేకోవర్ కోసం ఎంతగా శ్రమిస్తారో చెప్పాల్సిన పనిలేదు. స్టోరీ..రోల్ డిమాండ్ చేసిందంటే? బాడీ లో ట్రాన్సపర్మేషన్ అనేది సునాయాసంగా చేసేస్తారు. 120 కిలోలు ఉన్న నటుడు ఉన్నట్లుండి 80 కేజీలు తగ్గుతాడు. ఇంకా అవసరం అనుకుంటే 50 కి తగ్గి సిక్స్ ప్యాక్ లుక్ లో సైతం కనిపిస్తారు. ఇది కేవలం సెలబ్రిటీల కు…జిమ్ అంటే ఫ్యాషన్ ఉన్న వాళ్లకి మాత్రమే సాధ్యం. ‘బాహుబలి’ లో రెండు భిన్న పాత్రల కోసం ప్రభాస్ 110 కేజీలు పెరగడం మళ్లీ అప్పటికప్పుడు 40 కిలోలు తగ్గడం జరిగింది.

దంగల్’ కోసం అమీర్ ఖాన్ కూడా ఇలాగే వెయిట్ గెయన్ అవ్వడం..లాస్ అవ్వడం జరిగింది. తాజాగా బాలీవుడ్ నటుడు మనీష్ పాల్ కూడా తన తొలి షో ‘రఫుచక్కర్’ కోసం అలాగే ప్రయత్నించి సక్సెస్ అయ్యాడు. ఒక పాత్రకి వెయిట్ అవసరం అవ్వడం తో నాలుగు నెలల్లో 10 కేజీలు పెరిగాడు. అదే రోల్ కోసం మళ్లీ వెయిట్ లాస్ అవ్వాల్సి రావడం తో ఏకంగా 15 కేజీలు తగ్గాడు. ఇందు లో మనీష్ పాల్ ఐదు విభిన్న రూపాల్లో కనిపించనున్నాడు.

ఈ నేపథ్యంలో దర్శకుడు డిమాండ్ చేయడంతో వివిధ రూపాల్లోకి ట్రాన్సపర్మేషన్ కావాల్సి వచ్చింది. తాజాగా ఆ ఛెంజ్ కి సంబంధించిన ఫోటో లు ఇన్ స్టాలో వైరల్ అవుతున్నాయి. ఒక దాని లో 10 కేసులు వెయిట్ పెరిగింది కాగా..మరో ఫోటో 15 కేజీలు బరువు తగ్గిన ఫోటో. వెయిట్ లాస్ ఫోటో లో మనీష్ ట్రాన్సపర్మేషన్ కి అంతా షాక్ అవ్వాల్సిందే. తగ్గడం కోసం జిమ్ లో గట్టిగానే కసరత్తులు చేసినట్లు తెలుస్తుంది.

రేయింబవళ్లు శ్రమిస్తే గానీ ఇలాంటి ట్రాన్సపర్మేషన్ అనేది సాధ్యం కాదు. దీంతో పాటు డైట్ కంట్రో ల్ ఉండాలి. న్యూట్రిషన్ ఫుడ్ మాత్రమే తీసుకోవాలి. వీలైనంత వరకు పొట్టని ఖాళీ గా ఉంచాలి. మరి మనీష్ పాల్ (Maniesh Paul) వెయిట్ లాస్ కోసం ఎలాంటి స్ట్రాటజీ అనుసరించాడు అన్నది తెలియాలి. ప్రస్తుతం ఈ పోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus