Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Advertisement

సినీ పరిశ్రమలో కేవలం ప్రతిభ ఉంటే సరిపోదు. ఆ ప్రతిభను చాటుకోవడం కూడా చాలా ముఖ్యం. ఈ విషయాన్ని చాలా ప్రాక్టికల్ గా అందరికీ అర్థమయ్యేలా నటుడు శ్రీ నందు(Nandu) ఓ ప్రెస్ మీట్లో చెప్పుకొచ్చాడు. ‘ఇటీవల కాలంలో మీరు రియాలిటీలో ఉంటున్నట్టు కనిపిస్తుంది.

Nandu

దానికి కారణం ఏంటి.. మీకు రియలైజేషన్ ఎప్పుడు వచ్చింది’ అంటూ ఓ రిపోర్టర్ ప్రశ్నించాడు. అందుకు నందు మాట్లాడుతూ.. “గతంలో నేను పనిచేసిన పెద్ద సినిమా దర్శకులను మళ్లీ కలవడానికి, అవకాశాలు అడగడానికి చాలా బిడియం, మొహమాటం ఉండేవి.

సుకుమార్, దేవకట్టా, బోయపాటి శ్రీను వంటి అగ్ర దర్శకులతో పనిచేసినప్పటికీ తర్వాత చాలా ఏళ్ళ పాటు వాళ్ళని నేను కలవలేదు.సుకుమార్ గారి ‘100% లవ్’ లో నేను ఓ ముఖ్య పాత్రని పోషించాను. కానీ ఆ సినిమా తర్వాత ఆల్మోస్ట్ ఒక 7 ఏళ్ళ వరకు నేను ఆయన్ని కలవలేదు. అయితే అనుకోకుండా ‘రంగస్థలం’ సినిమా ఫంక్షన్ లో ఒకసారి సుకుమార్ గారిని కలవాల్సి వచ్చింది. అప్పుడు ఆయన నాతో రేపు ఒకసారి వచ్చి కలువు అన్నారు. దాంతో నెక్స్ట్ రోజు వెళ్లి ఆయన్ని నేను కలిశాను.

అప్పుడు ఆయన నాతో “నువ్వేమన్నా మహేష్ బాబు అనుకుంటున్నావా నిన్ను నేను గుర్తుపెట్టుకోవడానికి? నాకు వంద పనులు ఉంటాయి. అవన్నీ దాటుకుని నీ గురించి నేను ఆలోచాలి అంటే నువ్వు నన్ను కలుస్తూ ఉండాలి కదా..! నాకు నీపై మంచి ఇంప్రెషన్ ఉంది, కానీ ఇక్కడ ఎప్పుడూ కనిపిస్తూ ఉంటేనే.. మనోడు ఒకడు ఉన్నాడు కదా అని గుర్తుపెట్టుకుని.. ఏదైనా పాత్ర ఇవ్వాలని అనిపిస్తుంది. కాబట్టి తరచూ వచ్చి కలుస్తూ ఉండు” అంటూ హితబోధ చేశారు.

ఆయన మాటలతో నాలో ఒక పెద్ద రియలైజేషన్ వచ్చింది. మన టాలెంట్ ను నమ్ముకుని, ఎవరినీ మోసం చేయకుండా, మనకు కావాల్సిన పనిని అడగడంలో తప్పులేదని నేను గ్రహించాను. అప్పటి నుండి నా మొహమాటాన్ని పక్కన పెట్టి నన్ను అలాగే నా పనిని ప్రమోట్ చేసుకోవడం మొదలుపెట్టాను.సినిమా రంగంలోనే కాదు, ఏ రంగంలోనైనా సరే.. మొహమాటాలను వీడి, మనల్ని మనం నిరంతరం ప్రూవ్ చేసుకుంటూ ముందుకు సాగితేనే సక్సెస్ వస్తుంది అనేది నా అభిప్రాయం” అంటూ చాలా విలువైన మాటలు పలికాడు.

స్పెయిన్ లో పెళ్లి.. చెన్నైలో రిసెప్షన్.. అనిరుద్ మ్యారేజ్ పై వస్తున్న వార్తల్లో నిజమెంత ?

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus