Anirudh Ravichander : స్పెయిన్ లో పెళ్లి.. చెన్నైలో రిసెప్షన్.. అనిరుద్ మ్యారేజ్ పై వస్తున్న వార్తల్లో నిజమెంత ?

Advertisement

కోలీవుడ్ స్టార్ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్, కావ్య మారన్ పేర్లు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం ఉందంటూ వస్తున్న ప్రచారం ఇప్పుడు పెళ్లి వార్తల దాకా చేరింది. ముఖ్యంగా స్పెయిన్‌లో వివాహం, అనంతరం చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.

Anirudh Ravichander

తాజా ప్రచారం ప్రకారం, ఇరు కుటుంబాలు ఈ వివాహానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయని, ఏడాది చివర్లో ఈ వేడుక జరగవచ్చని కొన్ని సోషల్ మీడియా పేజీలు పేర్కొంటున్నాయి. అయితే ఇప్పటివరకు ఈ వార్తలపై అనిరుధ్ లేదా కావ్య మారన్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ప్రస్తుతం ఈ వార్తలు ఊహాగానాలకే పరిమితమయ్యాయి.

ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా అనిరుధ్ వ్యక్తిగత జీవితంపై ఇలాంటి రూమర్స్ వైరల్ అయ్యాయి. అప్పట్లో సోషల్ మీడియాలో పెళ్లి వార్తలు రావడంతో ఆయన సరదాగా స్పందిస్తూ, పుకార్లను నమ్మవద్దని చెప్పిన విషయం అభిమానులకు గుర్తుంది. ఇప్పుడు మళ్లీ అదే తరహా చర్చ మొదలవడంతో నెటిజన్స్ పాత పోస్టులను కూడా గుర్తు చేస్తున్నారు.

ఇక అనిరుధ్ విషయానికి వస్తే, ఆయన ప్రస్తుతం దక్షిణాది చిత్ర పరిశ్రమలో అత్యంత బిజీ సంగీత దర్శకుల్లో ఒకరు. వరుస స్టార్ హీరోల సినిమాలకు సంగీతం అందిస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. మరోవైపు సన్ రైజర్స్ కో-ఓనర్‌గా కావ్య మారన్ కూడా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరి పేర్లు కలిపి వినిపించడంతో అభిమానుల్లో చర్చ మరింత పెరిగింది. కొందరు ఈ వార్త నిజమైతే మంచి జోడీ అవుతారని కామెంట్లు చేస్తుండగా, మరికొందరు అధికారిక ప్రకటన వచ్చే వరకు ఇవన్నీ కేవలం సోషల్ మీడియా కథనాలేనని అభిప్రాయపడుతున్నారు.

మొత్తానికి, అనిరుధ్ – కావ్య మారన్ పెళ్లి వార్తలు ప్రస్తుతం వైరల్ అవుతున్నా.. నిజం ఏంటన్నది మాత్రం ఇరువురి స్పందన వచ్చిన తర్వాతే స్పష్టత రానుంది.

Raviteja Nannimala: కన్నీళ్ళు పెట్టుకున్న నటుడు రవితేజ

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus