Prabhas Sreenu: ఆ నటితో ఉన్న సంబంధం గురించి ప్రభాస్ శ్రీను రియాక్షన్ ఇదే!

Advertisement

గత ఏడాది ప్రభాస్ శ్రీను, నటి తులసి కలిసి ఆలీతో సరదాగా షోకి వచ్చారు. వీరిద్దరిదీ ఒక ఏజ్ కాదు. సినిమాల్లో పెద్దగా కలిసి నటించలేదు. సమకాలీన నటులు కూడా కాదు. ప్రభాస్ శ్రీను, తులసి షో చేయడమేంటనే సందేహాలు అందిరిలో కలిగాయి. అప్పటికే ఓ చిన్న రూమర్ మొదలైంది. తులసితో ప్రభాస్ శ్రీను రిలేషన్ లో ఉన్నారని కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలపై ప్రభాస్ శ్రీను, తులసి మౌనం వహించారు.

తాజాగా ప్రభాస్ శ్రీను స్పందించారు. తనతో తులసికి ఎలాంటి సంబంధం ఉందో స్పష్టంగా వివరించారు. ఆయన మాట్లాడుతూ.. తులసి నాకు తల్లి వంటివారు. మాపై తప్పుడు కథనాలు రాశారు. డార్లింగ్ మూవీ షూటింగ్ సమయంలో ఆమెను కేరింగ్ గా చూసుకున్నాము. ఆమె పెద్ద నటి. జీవితంలో అనేక ఒడిదుడుకులు చూసి ఇక్కడి వరకూ వచ్చారు. షూటింగ్ లో ఆమె నన్ను సరదాగా డార్లింగ్ అని పిలిచారు. దాని కొందరు అపార్థం చేసుకున్నారు.

మాపై ఎఫైర్ రూమర్స్ మొదలయ్యాక ఆమెనే మొదట స్పందించారు. నాకు మెసేజ్ పెట్టారు. మీ భార్యకు వీటి గురించి చెప్పు లేదంటే ఆవిడ కూడా అపార్థం చేసుకుంటుందని అన్నారు. మా ఆవిడ డాక్టర్. ఆమెను నేను ప్రేమ వివాహం చేసుకున్నాను. ఇలాంటి గాలి వార్తలు ఆమె నమ్మదు. మేము ఇద్దరం ఈ కథనాలు చూసి నవ్వుకునేవాళ్ళం అని ప్రభాస్ శ్రీను చెప్పుకొచ్చాడు. నటి చైల్డ్ ఆర్టిస్ట్ గా క్రెర్ ప్రారంభించారు.

మూడు వందలకు పైగా చిత్రాల్లో నటించారు. ఇక ప్రభాస్ కి మిత్రుడైన (Prabhas Sreenu) శ్రీను పరిశ్రమలో ప్రభాస్ శ్రీనుగా సెటిల్ అయ్యాడు. ప్రభాస్ తన సినిమాల్లో శ్రీనుకు ఆఫర్స్ ఇచ్చి ప్రోత్సహించాడు. గతంలో ప్రభాస్-శ్రీనుకు విబేధాలు వచ్చాయనే ప్రచారం జరిగింది .

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus