Takkar Review In Telugu: టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • June 9, 2023 / 03:13 PM IST

Cast & Crew

  • సిద్ధార్ధ్ (Hero)
  • దివ్యాంశ కౌశిక్ (Heroine)
  • యోగిబాబు, అభిమన్యు సింగ్ తదితరులు.. (Cast)
  • కార్తీక్ జి.క్రిష్ (Director)
  • టి.జి.విశ్వప్రసాద్ - అభిషేక్ అగర్వాల్ (Producer)
  • నివాస్ కె.ప్రసన్న (Music)
  • మురుగేసన్ (Cinematography)

“మహా సముద్రం” అనంతరం కొంత విరామంతో తెలుగు ప్రేక్షకుల్ని “టక్కర్” అంటూ పలకరించాడు సిద్ధార్ధ్. నిజానికి ఈ చిత్రం ఎప్పుడో 2020లో విడుదల కావాల్సి ఉన్నప్పటికీ.. కారణాంతరాల వలన మూడేళ్ళ తర్వాత బయటకొచ్చింది. మరి ఈ డిలే రిలీజ్ సినిమాతో సిద్ధార్ధ్ ఆడియన్స్ ను ఆకట్టుకోగలిగాడా లేదా అనేది చూద్దాం..!!

కథ: తన పేదరికాన్ని భరించలేక ఎలాగైనా ధనికుడు అయిపోవడం కోసం అడ్డదార్లు తొక్కుతుంటాడు గుణ (సిద్ధార్డ్). ఆ క్రమంలో తనకు తెలియకుండానే పలు మాఫియా గ్యాంగ్ లతో తలపడతాడు. అదే సందర్భంలో పరిచయమవుతుంది లక్కీ (దివ్యాంశ కౌశిక్). గుణ-లక్కీ కలిసి చేసిన ప్రయాణమే “టక్కర్” కథాంశం.

నటీనటుల పనితీరు: సిద్ధార్ధ్ ఇప్పటివరకూ తన లుక్స్ విషయంలో చాలా ప్రయోగాలు చేశాడు కానీ.. “టక్కర్”లో లుక్ మాత్రం అతనికి ఏమాత్రం సెట్ అవ్వలేదు. ముఖ్యంగా పిల్లి గెడ్డం అస్సలు సూట్ అవ్వలేదు. అలాగే అతడి కాస్ట్యూమ్స్ కూడా ఎందుకో సినిమా టోన్ కి సింక్ అవ్వలేక చాలా ఇబ్బందిపడ్డాడు. నటుడిగా మాత్రం ఎప్పట్లానే అలరించడానికి తనవంతు ప్రయత్నం చేశాడు. అయితే.. అతడి పాత్రకు ప్రేక్షకులెవరూ కనెక్ట్ అవ్వలేకపోయారు.

దివ్యాంశ కౌశిక్ కాస్త బోల్డ్ గా, రోమాంటిక్ & ఎక్స్ పోజింగ్ సీన్స్ లో ఎలాంటి ఇబ్బందిలేకుండా నటించేసింది. అయితే.. ఆమె గ్లామర్ కు ఇచ్చిన ప్రాధాన్యత ఆమె నటనకు ఇవ్వలేకపోవడంతో.. సినిమాకి ఒక అందాల అలంకరణగా మిగిలిపోయింది. అభిమన్యు సింగ్ పాత్ర ఇంట్రడక్షన్ బాగున్నప్పటికీ.. సెకండాఫ్ లో ఆ క్యారెక్టర్ కి సరైన జస్టిఫికేషన్ లేకపోవడంతో అతడి నటన కానీ పాత్ర కానీ ఎలివేట్ అవ్వలేకపోయాయి. యోగిబాబు కామెడీ తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించడం కష్టమే.

సాంకేతికవర్గం పనితీరు: ఒరిజినల్ ట్యూన్స్ ఎలా ఉన్నాయో తెలియదు కానీ.. తెలుగు అనువాదం మాత్రం అస్సలు బాలేదు. చాలా పదాలు ట్యూన్ లో ఇరకటం కోసం రాసినట్లున్నాయి. పాటలు కానీ నేపధ్య సంగీతం కానీ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. మురుగేసన్ సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. ఛేజింగ్ సీక్వెన్స్ & బిల్డప్ షాట్స్ ను కాస్త కొత్తగా తెరకెక్కించాడు. ప్రొడక్షన్ డిజైన్ రిచ్ గా ఉంది. కానీ.. ఆర్ట్ వర్క్ మాత్రం చాలా చోట్ల తేలిపోయింది. వి.ఎఫ్.ఎక్స్ వర్క్ కూడా పేలవంగా ఉంది.

దర్శకుడు కార్తీక్ జి. క్రిష్ రాసుకున్న కథ మనకు తరుణ్ హీరోగా తెరకెక్కిన “అదృష్టం” సినిమాను గుర్తుకుతెస్తుంది. మాఫియా బ్యాక్ డ్రాప్ యాంగిల్ ఒక్కటే కాస్త కొత్తగా ఉంటుంది. అయితే.. ఫస్టాఫ్ మొత్తం పాత్రల పరిచయంతో సరిపెట్టిన దర్శకుడు, సెకండాఫ్ ను సరిగా రాసుకోవడంలో విఫలమయ్యాడు. హీరోహీరోయిన్ మినహా ఏ ఒక్క పాత్ర కూడా సరిగా ఎలివేట్ అవ్వలేకపోవడం, ఉన్న కొన్ని హైలైట్ సీన్స్ కూడా కనెక్టివిటీ లేని కారణంగా వేస్ట్ అయిపోయాయి. ఓవరాల్ గా దర్శకుడిగా, కథకుడిగా కార్తీక్ జి.కృష్ణ విఫలమయ్యాడు.

విశ్లేషణ: ఒక యాక్షన్ థ్రిల్లర్ కు లాజిక్స్ & క్యారెక్టర్స్ ఆర్క్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. దర్శకుడు మరియు రచయిత అయిన కార్తీక్ జి.కృష్ణ ఆ బేసిక్ రూల్ ని ఎందుకని గాలికొదిలేశాడో అర్ధం కాలేదు. అలాగే.. మూడేళ్ళ క్రితం సినిమా (Takkar) కావడం వల్ల చాలా సన్నివేశాలు కనెక్టివిటీ లేక ఇబ్బందిపెడతాయి. సో, సిద్ధార్ధ్ కష్టం, దివ్యాంశ కౌశిక్ గ్లామర్ బూడిదలో పోసిన పన్నీరయ్యాయి.

రేటింగ్: 1/5

Click Here To Read in ENGLISH

Rating

1
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus