సీనియర్ నటుడి బీభత్సం!

  • December 16, 2020 / 08:40 AM IST

తెలుగులో నెంబర్ వన్ యాంకర్ గా కొనసాగుతున్న సుమ ఎలాంటి షో చేసినా కూడా క్లిక్కవాల్సిందే. ఏళ్ల తరబడి షోలను కొనసాగించే సుమ కెరీర్ లో క్యాష్ ప్రోగ్రామ్ కు కూడా మంచి క్రేజ్ దక్కింది. షోలోకి సెలబ్రెటీలను ఇన్వైట్ చేస్తూ వారితో సరదాగా గేమా ఆడిస్తూనే వివిధ రకాల ప్రశ్నలు సందిస్తూ ఉంటుంది. మంచి రేటింగ్ తో దూసుకుపోతున్న క్యాష్ లో ఇటీవల ఒక సీనియర్ నటుడు చేసిన రచ్చ మామూలుగా లేదు.

ఈ వారం ప్రసారం కాబోయే షో యొక్క ప్రోమోను విడుదల చేయగా ఒక్కసారిగా వైరల్ అయ్యింది. షోలోకి అతిధులుగా నలుగురు విలన్స్ వచ్చారు. తోటపల్లి మధు, సత్యరాజ్, అలాగే పృథ్వి రాజ్ తో పాటు అజయ్ రత్నం కూడా వచ్చారు. అయితే పృథ్వి ఎంట్రీతోనే మైండ్ బ్లాక్ సాంగ్ కి అదిరిపోయే స్టెప్పులు వేశాడు. అలాగే షర్ట్ విప్పేసి సుమ ముందే స్టిల్స్ ఇచ్చాడు.

ఇక సుమ అతనిపై కూడా పంచ్ లు గట్టిగానే వేసింది. ఆయనకు కొంచెం అమ్మాయిలను పువ్వులను చూపించండి అంటూ కౌంటర్ ఇవ్వడంతో పృథ్వీరాజ్ కాస్త తగ్గాడు. ఇక సత్యరాజ్ పై పంచ్ లు వేయడానికి సుమ బాగానే ప్రయత్నం చేసింది. కానీ ఆమెకు తగ్గట్టుగా రివర్స్ పర్ఫెమెన్స్ తో షాక్ ఇచ్చాడు సత్యరాజ్. చూస్తుంటే విలన్స్ సుమను మాత్రం ఒక ఆటాడుకున్నట్లు తెలుస్తోంది. మరి ఫుల్ షోలో ఇంకా ఏలాంటి రచ్చ చేశారో చూడాలి.

2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus