విమానంలో బిడ్డకు పాలిస్తూ వీడియో షేర్ చేసిన ప్రముఖ నటి.. వీడియో వైరల్.

సాధారణంగా మహిళలు పబ్లిక్ ప్లేసెస్‌లో బిడ్డకు పాలివ్వడానికి ఇబ్బంది పడుతుంటారు. ప్లేస్‌తో పాటు వారు ధరించే దుస్తులు దీనికి కారణం కావచ్చు. అయితే తల్లులు పొత్తిళ్లలో పడుకోబెట్టుకుని తమ బిడ్డకు ఆకలి తీర్చడంలో మాధుర్యాన్ని పొందుతుంటారు. అయితే బేబీకి పాలిచ్చే విషయంలో ఇలాంటివి తనకు అడ్డుకాదని చెప్తున్నారు ప్రముఖ సీరియల్ నటి సమీరా షెరీఫ్.. పబ్లిక్ ప్లేసులో తన బిడ్డకు పాలివ్వడంలో మాధుర్యాన్ని పొందుతూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో కూడా షేర్ చేశారామె.

‘‘నేను వేసుకున్న డ్రస్ చాలా సౌకర్యంగా ఉంది. దీని వల్ల నా కొడుక్కి పాలు ఇవ్వడానికి ఎలాంటి ఇబ్బందులు లేవు.. వాడికి ఆకలి అయినప్పుడల్లా పాలిస్తాను’’ అని రాసుకొచ్చారు. ఈ వీడియోలో విమానంలో ఆమె తన బేబీకి పాలిస్తూ.. జో కొడుతూ కనిపించారు. నెటిజన్లు, ముఖ్యంగా మహిళలను ఈ వీడియో బాగా ఆకట్టుకుంటోంది. ‘అసలైన అమ్మతనాని అద్దం పట్టేలా అందంగా చెప్పారు.. మీ బిడ్డ అదృష్టవంతుడు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ప్రముఖ నటి సన కొడుకు అన్వర్‌తో సమీరాకు 2019లో వివాహం జరిగింది. వీరిద్దరు దాదాపు నాలుగు సంవత్సరాలు ప్రేమించుకుని తర్వాత పెళ్లితో ఒక్కటైయ్యారు. ఇక సమీర గతంలోనూ నిండు గర్భిణీగా ఉన్నప్పుడు స్కేటింగ్ చేసి వార్తల్లో నిలిచారు.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus