Kushi Movie: ‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

  • December 30, 2022 / 07:54 PM IST

చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ ‘గోకులంలో సీత’ ‘సుస్వాగతం’ వంటి సినిమాలు… చిరంజీవి తమ్ముడి సినిమాలు అనే బ్రాండ్ తోనే బయటకు వచ్చి హిట్ అయ్యాయి. కానీ ‘తొలిప్రేమ’ సినిమా పవన్ కళ్యాణ్ కు యూత్ లో ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడేలా చేసింది. ఆ తర్వాత వచ్చిన ‘తమ్ముడు’ చిత్రం కూడా ఆ ఇమేజ్ ను రెట్టింపు చేసింది. ఇక ‘బద్రి’ సినిమా మాస్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పింది.. పవన్ కు మాస్ ఇమేజ్ ను తెచ్చిపెట్టింది. అయితే ‘ఖుషి’ సినిమా మాత్రం పవన్ కళ్యాణ్ ని స్టార్ హీరోని చేసింది. ‘చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్’.. అనే మాటని ఈ మూవీ కొట్టిపడేసింది.

పవన్ కళ్యాణ్ కు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడేలా చేసింది. ఈ మధ్య కాలంలో రీ రిలీజ్ ల ట్రెండ్ మొదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇయర్ ఎండింగ్ సందర్భంగా అంటే డిసెంబర్ 31న ‘ఖుషి’ చిత్రాన్ని థియేటర్లలో రీ రిలీజ్ చేయబోతున్నారు. జనవరి 6 వరకు అంటే వారం రోజుల పాటు ‘ఖుషి’ సినిమా థియేటర్లలో ప్రదర్శింపబడనుంది. అయితే యూట్యూబ్ లో అందుబాటులో ఉండే ‘ఖుషి’ ని, బుల్లితెర పై ‘స్టార్ మా’ లో రెండు, మూడు రోజులకు ఒకసారి టెలికాస్ట్ అయ్యే ‘ఖుషి’ ని డబ్బులు పెట్టి మరీ థియేటర్ కు వెళ్ళి చూడాల్సిన అవసరం ఉందా అని చాలా మంది అనుకోవచ్చు. అలాంటి వారి కోసం ‘ఖుషి’ చిత్రాన్ని థియేటర్లలో ఎందుకు చూడాలో…. తెలియజేయడానికి అలాగే ఆసక్తిని పెంచడానికి గల 10 కారణాలను ఇప్పుడు చూద్దాం :

1) కలకత్తా లో పుట్టిన సిద్దు సిద్ధార్థ రాయ్ కు.. కైకలూరు లో పుట్టిన మధుమతికి దేవుడు ఎలా ముడి వేశాడు అన్నది ఈ ‘ఖుషి’ కథ. ఓపెనింగ్ షాట్ లో వచ్చే ఈ డైలాగ్ .. సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది. అలా అని ఈ లైన్ ను బేస్ చేసుకుని వాళ్ళు కలవరు. అదే కథలో ఉన్న ఫ్రెష్ నెస్.

2) హీరో ఇంట్రొడక్షన్ కి 100 సుమోలు లేవడాలు వంటివి ఉండవు. ఎక్కడో ధ్యానం చేసుకుంటున్న హీరోని వేసెయ్యాలని కొంతమంది రౌడీలు వస్తారు.. మన హీరో రివర్స్ లో వాళ్లనే వెతుక్కుంటూ వెళ్లి వాళ్ళను కలకత్తా వీధుల్లో పరుగులు పెట్టించి మరీ కొడతాడు. పరుగులు పెడుతూ ఫైట్స్.. ఈ కాన్సెప్ట్ అప్పటికి తెలుగు సినిమాల్లో చాలా కొత్త ఫీలింగ్ కలిగించింది.

3) హీరో, హీరోయిన్లు కలుసుకున్నాక వచ్చే అమ్మాయే సన్నగా పాట క్లాస్, మాస్ అనే తేడా లేకుండా ఓ ఊపు ఊపేస్తుంది.





4) సెల్ ఫోన్లు లేని రోజులు, సోషల్ మీడియా అనే పదం కూడా తెలీని రోజులు అవి. ఆ టైంలో హీరో టెలిఫోన్ భూత్ లో తన తల్లితో మాట్లాడుతుంటే హీరోయిన్ వేరేగా అర్ధం చేసుకుని.. తర్వాత నిజం తెలిసాక ‘అమ్మ.. ‘ అంటూ ఇచ్చే ఎక్స్ప్రెషన్.. దానికి మన హీరో ఇచ్చే రియాక్షన్ ఉంటుంది చూడాలి. వన్స్ మోర్ అని కేకలు వేయాలి అనిపిస్తుంది.





5) అన్ని సినిమాల్లోనూ హీరో, హీరోయిన్లు కలిశాక కథకి శుభం కార్డు పడుతుంది. కానీ ‘ఖుషి’ లో హీరో హీరోయిన్లు విడిపోయాక అసలు కథ మొదలవుతుంది.





6)చిన్న నడుం గురించి జరిగిన గొడవకి సెకండ్ హాఫ్ మొత్తం రన్ అవుతుంది అంటే.. చాలా ఫూలిష్ అనిపిస్తుంది. కానీ దాని చుట్టూ అల్లిన కథనం చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది.కుర్చీలో కదలకుండా చూసేలా చేస్తుంది.





7) ఇప్పుడొస్తున్న సినిమాల్లో హీరోయిన్లు ఎంతగా గ్లామర్ వడ్డించినా.. అది ఎక్కువగా గుర్తుండదు. కానీ ‘ఖుషి’ లో నడుము సీన్ ఒక్కటి చాలా ప్రత్యేకంగా.. చాలా రొమాంటిక్ గా అనిపిస్తుంది.





8) క్లైమాక్స్ లో హీరో కోసం హీరోయిన్ .. హీరోయిన్ కోసం హీరో కలవడానికి ట్రై చేసే సన్నివేశం.. హృదయాన్ని హత్తుకునేలా ఉంటుంది.





9) పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పవన్ కళ్యాణ్ కాస్ట్యూమ్స్ అన్నీ కూడా డిఫెరెంట్ గా అనిపిస్తాయి. క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ కూడా రక్తపాతం లేకుండానే మాస్ ఆడియన్స్ కు గూజ్ బంప్స్ తెప్పిస్తుంది.





10) సినిమా చివర్లో హీరో, హీరోయిన్లు ఎలా కలిశారు..? ఎలా పెళ్లి చేసుకున్నారు? అనే ఆలోచన రాకుండా వాళ్ళు 13 మంది పిల్లల్ని కన్నట్టు సీన్ పెట్టి.. థియేటర్ నుండి జనాలు నవ్వుకుంటూ, హ్యాపీగా ఫీలవుతూ ఇంటికెళ్లేలా చేస్తుంది ఈ మూవీ.





కాబట్టి పవన్ కళ్యాణ్ డై హార్డ్ ఫ్యాన్స్.. ‘ఖుషి’ చిత్రాన్ని థియేటర్లలో చూడలేకపోయిన వాళ్ళు.. ఈసారి ఆ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్! ‘ఖుషి’ థియేటర్లో చూస్తున్నప్పుడు వేరే హీరోల ఫ్యాన్స్ అయినా సరే ఆ 2 గంటల 49 నిమిషాలు పవన్ కళ్యాణ్ అయిపోవడం గ్యారంటీ

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus