మీట్ మై జూనియర్.. సత్యదేవ్ పోస్ట్!

  • February 8, 2021 / 06:58 PM IST

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన నటుడు సత్యదేవ్ ఆ తరువాత హీరోగా మారాడు. ఓ పక్క సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూనే మరోపక్క హీరోగా సినిమాలు చేస్తున్నాడు. లాక్ డౌన్ లో అతడు నటించిన ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మధ్యన మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా సత్యదేవ్ ని ఇంటికి పిలిపించుకొని మాట్లాడారు. అంతేకాదు ఆయన నటిస్తోన్న ‘లూసిఫర్’ రీమేక్ లో సత్యదేవ్ కి ఛాన్స్ కూడా ఇచ్చారు.

కెరీర్ పరంగా దూసుకుపోతున్న ఈ నటుడు తన ప్రైవేట్ లైఫ్ గురించి మాత్రం ఎక్కడా పెద్దగా మాట్లాడరు. ఒకట్రెండు ఇంటర్వ్యూలలో తన భార్య దీపికా గురించి గొప్పగా మాట్లాడారు. ఓ స్నేహితురాలిగా ఎంతో సపోర్ట్ చేసిందని.. ఆమెని చాలా గౌరవిస్తుంటానని చెప్పాడు. అంతకుమించి సోషల్ మీడియాలో ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేయడం లాంటివి మాత్రం ఎప్పుడూ చేయలేదు. ఈ హీరో గారికి కొడుకు ఉన్నాడనే విషయం కూడా చాలా మందికి తెలియదు.

తాజాగా తన భార్యా, కొడుకుతో ఉన్న ఫోటోని షేర్ చేసిన సత్యదేవ్ ‘మీట్ మై జూనియర్’ అంటూ పోస్ట్ పెట్టాడు. ఈరోజు తన కొడుకు సవర్ణిక్ మొదటి పుట్టినరోజు జరుపుకుంటున్నాడని అతడిని బ్లెస్ చేయమని కోరాడు. ఈ ఫోటో చూసిన నెటిజన్లు సవర్ణిక్ చాలా క్యూట్ గా ఉన్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సత్యదేవ్ ‘గుర్తుందా శీతాకాలం’, ‘గాడ్సే’, ‘తిమ్మరుసు’ వంటి చిత్రాల్లో నటిస్తున్నారు.


Most Recommended Video

జాంబీ రెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా
శృతీ ఈ సినిమాలను రిజెక్ట్ చేసి మంచి పనే చేసిందా..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus