తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

ఏ సినిమాని ప్రమోట్ చెయ్యాలన్నా.. లేదా ఏ వేడుకను నిర్వహించాలన్నా… ముందుగా యాంకర్ అవసరం చాలా ఉంటుంది. ఆ ఈవెంట్ కనుక సక్సెస్ అయితే ముందుగా యాంకర్ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. అందుకే దర్శక నిర్మాతలు యాంకర్లకు ఒక ఈవెంట్ ను నిర్వహించడానికి పెద్ద ఎత్తున పారితోషికం చెల్లిస్తూ ఉంటారు.తెలుగులో మనకి చాలా మంది యాంకర్లు ఉన్నారు. మిగిలిన భాషల్లో కంటే కూడా మన తెలుగు యాంకర్లు బాగా పాపులర్ అయ్యారనే చెప్పొచ్చు. ఏ వేడుకలో అయినా సరే సెలబ్రిటీల కంటే కూడా చాలా అందంగా ఆకర్షించే విధంగా వీరు రెడీ అవుతూ ఉంటారు. ఆ టైములో వేళ్ళ వయసు ఎంత ఉంటుంది? ఇంత అందంగా ఉన్నారు అని అంతా అనుకునే ఉంటారు.

నిజానికి తెలుగులో ఉన్న యాంకర్లందరికీ దాదాపు పెళ్లిళ్లు అయిపోయాయి. అయినప్పటికీ వాళ్ళ గ్లామర్ ఎప్పుడూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గాన నిలుస్తుంటుంది. అందుకే యాంకర్ల వయసు ఎంత అనే విషయాల పై చర్చ జరుగుతూ ఉంటుంది. మరి తెలుగులో ఉన్న టాప్ యాంకర్లు మరియు వారి వయసు వివరాలను తెలుసుకుందాం రండి :

1) సుమ :

తెలుగులో ఈమె స్టార్ యాంకర్. నటుడు రాజీవ్ కనకాల భార్య కూడా..! నిజానికి ఈమె తెలుగావిడ కాదు..ఒక మలయాళీ.అయినప్పటికీ అనర్గళంగా తెలుగు మాట్లాడగలదు. ఈమెకు ఉన్న క్రేజ్ పీక్స్. ఇక సుమ వయసు విషయానికి వస్తే.. 45 సంవత్సరాలు.1975 వ సంవత్సరం మార్చి 25న ఈమె జన్మించింది.

2) రోజా :

అప్పటి స్టార్ హీరోయిన్ రోజా.. ఇప్పటికీ సినిమాల్లో నటిస్తున్నప్పటికీ ‘జబర్దస్త్’ కు జడ్జిగా వ్యవహరిస్తూనే పలు షోలకు యాంకర్ గా కూడా వ్యవహరిస్తూ వస్తోంది. 1972వ సంవత్సరం నవంబర్ 17న జన్మించిన రోజా వయసు 48సంవత్సరాలు.

3) ఝాన్సీ :

ఈమెకు కూడా మొదటి నుండీ మంచి క్రేజ్ ఏర్పడింది. సినిమాల్లో నటిస్తూ కూడా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. 1971 మార్చి 7న జన్మించిన ఝాన్సీ వయసు 49 సంవత్సరాలు.

4) అనసూయ :

ఓ పక్క యాంకర్ గా రాణిస్తూనే.. సినిమాల్లో కూడా మంచి ఆఫర్లు అందుకుంటుంది అనసూయ. ఈమె గ్లామర్ కు కుర్ర కారు కూడా ఫిదా అయిపోతూ ఉంటారు.1985 మే 15న జన్మించిన ఈమె వయసు 35 సంవత్సరాలు.

5) ఉదయభాను :

పలు సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ.. తరువాత ఐటెం సాంగ్స్ కూడా చేసింది. స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఉదయభాను 1973 వ సంవత్సరంలో ఆగష్టు 4న జన్మించింది. ఈమె వయసు 47 సంవత్సరాలు.

6) శ్యామల :

సైలెంట్ గా ఎంట్రీ ఇచ్చి స్టార్ యాంకర్ అయిపోయింది శ్యామల.పలు సినిమాల్లో కూడా నటించింది. నవంబర్ 5, 1989 వ సంవత్సరంలో జన్మించిన ఈమె వయసు 31 సంవత్సరాలు.

7) రష్మీ :

మరో జబర్దస్త్ హాట్ యాంకర్ రష్మీ గ్లామర్ డోస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈమె వయసు ఇప్పటికీ పెద్ద మిస్టరీ. అయినప్పటికీ గూగుల్ లెక్కల ప్రకారం అయితే 1988 వ సంవత్సరంలో ఏప్రిల్ 7న జన్మించింది.కాబట్టి రష్మీ వయస్సు 32 సంవత్సరాలు.

8) శ్రీముఖి :

‘పటాస్’ షోతో మంచి క్రేజ్ ను సంపాదించుకుని స్టార్ యాంకర్ అయిపోయింది శ్రీముఖి. ‘జులాయి’ ‘నేను శైలజ’ ‘జెంటిల్మెన్’ వంటి సినిమాల్లో కూడా నటించింది. 1993వ సంవత్సరం మే 10న జన్మించిన శ్రీముఖి వయసు 32 సంవత్సరాలు.

9) వర్షిణి :

మొదట్లో పలు సినిమాల్లో నటించినా రాని గుర్తింపుని.. యాంకర్ గా మారిన తరువాత రప్పించుకుంది వర్షిణి. 1994 ఏప్రిల్ 6న జన్మించిన ఈమె వయసు 26 సంవత్సరాలు.

10) విష్ణు ప్రియా:

ఈ మధ్యనే పాపులర్ అయిన యాంకర్ విష్ణు ప్రియా… 1987 ఫిబ్రవరి 22న జన్మించింది. ఈమె వయసు 33 సంవత్సరాలు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus