Suman: స్వామి వారి చల్లని చూపు నాపై ఉందని అప్పుడే తెలిసింది!

Advertisement

ఎన్నో సినిమాలలో నటుడిగా నటిస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సీనియర్ నటుడు సుమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన హీరోగా మాత్రమే కాకుండా విలన్ గా కూడా నటించి మెప్పించారు. అలాగే ఒక అన్నమయ్యగాను సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి తలపించేలా స్వామి వారి పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారనే చెప్పాలి. ఇలా నటుడిగా ఎన్నో విభిన్న పాత్రలలో నటించి మెప్పించిన సుమన్ ప్రస్తుతం పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడ్డారు.

గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు తన స్నేహితులతో కలిసి స్వామి వారిని దర్శించుకున్నటువంటి సుమన్ అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ నాకు తిరుమల శ్రీవారిపై ఏమాత్రం నమ్మకం లేదు. ఎప్పుడు కూడా భక్తితో స్వామి వారిని తాను పూజించలేదని తెలిపారు. ఈ విధంగా స్వామి వారిపై నాకు భక్తి లేకపోయినప్పటికీ ఆయన చల్లని చూపు నాపై ఉందని అందుకే తనకు అన్నమయ్య సినిమాలో శ్రీవారి పాత్రలో నటించే అవకాశం లభించిందనీ సుమన్ (Suman) తెలిపారు.

ఈ విధంగా శ్రీవారి పాత్రలో నాకు నటించే అవకాశం వచ్చిన సమయంలోనే నాపై స్వామివారి కృప ఉందని నాకు అర్థమైంది అంటూ ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తిరుపతిలో ఐఏఎస్ అధికారి రామారావు కుమారుడి వివాహం జరగడంతో ఈ వివాహానికి హాజరైనటువంటి సుమన్ అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇలా స్వామివారి దర్శనం అనంతరం ఈయన మీడియాతో మాట్లాడుతూ స్వామి వారి గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read