Suman: ఆది పురుష్ చూస్తూ నిరాశ చెందాను: సుమన్

  • June 21, 2023 / 08:50 PM IST

తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా ఎంతో గుర్తింపు సంపాదించుకున్నటువంటి సీనియర్ నటుడు సుమన్ తాజాగా ప్రభాస్ హీరోగా నటించిన ఆది పురుష్ సినిమా గురించి స్పందిస్తూ తన అభిప్రాయాలను తెలియజేశారు. ఈ సినిమా జూన్ 16వ తేదీ విడుదల అయ్యి మిశ్రమ స్పందన అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఇలా మిశ్రమ స్పందన అందుకున్నటువంటి ఈ సినిమా గురించి పలువురు స్పందిస్తూ వారి అభిప్రాయాలను తెలియజేశారు. అయితే తాజాగా నటుడు సుమన్ కూడా ఈ సినిమా గురించి తన అభిప్రాయాలను తెలియజేశారు.

ఈయన కూడా శ్రీరామదాసు సినిమాలో రాముడి పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ…ఆది పురుష్ సినిమాని కేవలం రావణాసురుడు సీతను అపహరించినప్పటినుంచి సీతను కాపాడే వరకు మాత్రమే చూపించారు. ఇక మనం చిన్నప్పటినుంచి రాముడిని నీలిరంగులో మాత్రమే చూస్తున్నాము అలాగే మీసాలు గడ్డాలు కూడా ఉండవు. ఈ సినిమాలో ప్రభాస్ కి హెయిర్ స్టైల్ తో పాటు గడ్డం మీసాలు కూడా ఉన్నాయి అలాగే రెండున్నర సంవత్సరాల పాటు ఈ సినిమా కోసం ప్రభాస్ పని చేశారు.

ఇన్ని రోజులపాటు తన బాడీని అదే విధంగా మెయింటైన్ చేయడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి. ఈ విషయంలో ప్రభాస్ నిజంగా హాట్సఫ్ చెప్పాలి అంటూ ఈయన తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇక రావణాసురుడికి మోడ్రన్ హెయిర్ స్టైల్ పెట్టారని పూర్తిగా తన వేషధారణ మార్చారని తెలిపారు. ఇలా రావణాసురుడి వేషధారణ మార్చడం పూర్తిగా తప్పని ఇది ఏమాత్రం కరెక్ట్ కాదంటూ సుమన్ తెలిపారు.ఇక ఇందులో గ్రాఫిక్స్ కొన్నిచోట్ల బాగున్నాయి మరికొన్ని చోట్ల పూర్తిగా నిరాశ పరిచయాన్ని తెలిపారు.

కొన్నిచోట్ల ఈ సినిమాని చూస్తుంటే హాలీవుడ్ సినిమాలను చూసిన విధంగా ఉందని,ఈ సినిమా చూస్తున్నంత సేపు నాకు నిరాశ ఎదురయిందని తెలిపారు. ఈ విధమైనటువంటి మైథాలజికల్ సినిమాలను నార్త్ వారి కన్నా సౌత్ ఇండస్ట్రీకి చెందిన దర్శకులు బాగా చేయగలరు అంటూ (Suman) సుమన్ తన అభిప్రాయాన్ని తెలియజేశారు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus