Suman: సుమన్ భార్య శిరీష తాతయ్య ఎంత పెద్ద నటుడో తెలుసా?

  • June 21, 2023 / 03:52 PM IST

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి స్టార్ అయినవాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ ఆ స్టార్ స్టేటస్ ని ఎక్కువ కాలం కొనసాగించలేకపోయిన, స్టార్ గా ఉన్నన్ని రోజులు మాత్రం వాళ్ళ మేనియా ఒక రేంజ్ లో నడిచింది. అలాంటి హీరోలలో ఒకడు సుమన్, అప్పట్లో ఈయన మెగాస్టార్ చిరంజీవి తర్వాత అంతటి క్రేజ్ తెచ్చుకున్న నటుడు. ఆయనలాగే డ్యాన్స్ చెయ్యగలడు, ఫైట్స్ చెయ్యగలడు, యాక్టింగ్ చెయ్యగలడు,వీటి అన్నిటికి మించి చిరంజీవి కంటే కూడా అందగాడు.

అప్పట్లో ఆయన సినిమా వసూళ్లు చిరంజీవి సినిమాలతో సరిసమానంగా, నువ్వా నేనా అనే రేంజ్ లో ఉండేది. అయితే సుమన్ ఆ తర్వాత కొంతమంది చేసిన కుట్రపూరిత రాజకీయాలు వల్ల ఆయన జైలుపాలు కావాల్సి వచ్చింది. ఆ తర్వాత కొన్నేళ్ళకు ఆయన నిర్దోషిగా బయటపడ్డాడు కానీ కెరీర్ మాత్రం ఒకప్పుడు ఉన్నంత రేంజ్ లో లేదు.

రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన ‘మొండి మొగుడు పెంకి పెళ్ళాం’, ‘బావ బామ్మర్ది’ మరియు ‘పెద్దింటి అల్లుడు’ వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి, కానీ ఆ తర్వాత సుమన్ అదే రేంజ్ హిట్ స్ట్రీక్ ని కొనసాగించలేకపోవడం వల్ల హీరో రోల్స్ చిన్న గా మిస్ అయ్యి, క్యారక్టర్ ఆర్టిస్టు రోల్స్ కి షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం వచ్చింది. ఇది ఇలా ఉండగా సుమన్ భార్య శిరీష తెలుగు సినీ పరిశ్రమ కుటుంబానికి చెందిన అమ్మాయి అనే విషయం చాలా మందికి తెలియదు.

గతం లో ప్రముఖ రైటర్/నటుడు/ డైరెక్టర్ డీవీ నరసరాలు, తన మనవరాలు శిరీష ని సుమన్ కి ఇచ్చి పెళ్లి చేసాడు. అప్పట్లో సుమన్ ఎలాంటి తప్పు చెయ్యలేదని నమ్మిన మొట్టమొదటి వ్యక్తి నవసరాలునే అట. అందుకే తన మానవరాలుని ఇచ్చి పెళ్లి చేసాడని టాక్. ఈ ఇద్దరి దంపతులకు అఖిలజ ప్రత్యుక్ష్య అనే కూతురు కూడా ఉంది. ఈమె గొప్ప క్లాసికల్ డ్యాన్సర్, హీరోయిన్ అవ్వాల్సిన లక్షణాలు అన్నీ ఉన్నా కూడా (Suman) సుమన్ కి ఇష్టం లేకపోవడం తో హీరోయిన్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టలేదు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus