Akshara Haasan: అక్షర హాసన్ కొనుగోలు చేసిన ఇంటి ఖరీదు ఎంతో తెలుసా?

  • November 3, 2023 / 06:01 PM IST

ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న లెజెండ్ యాక్టర్ కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే వరుస సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాజకీయాలలో కూడా ఎంతో బిజీగా ఉంటున్నారు. ఈ విధంగా కమల్ హాసన్ నటుడిగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక ఈయన వారసురాలిగా శృతిహాసన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తండ్రికి తగ్గ తనయ అనే పేరు సంపాదించుకున్నారు. శృతిహాసన్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారో అయితే కమల్ హాసన్ కి మరొక కుమార్తె కూడా ఉన్నారు అనే సంగతి మనకు తెలిసిందే.

కమల్ హాసన్ చిన్న కుమార్తె అక్షర హాసన్ (Akshara Haasan) గురించి అందరికీ తెలుసు. కానీ ఈమె మాత్రం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు ఇప్పటివరకు ఈమె పెద్దగా సినిమాలలో నటించలేదు. ఇలా సినిమాలకు దూరంగా ఉన్నటువంటి అక్షర హాసన్ తాజాగా ముంబైలో ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేశారు. ఇలా సినిమాలకు దూరంగా ఉన్నటువంటి ఈమె ఏకంగా ముంబైలోనే ఏక్తా టవర్ లోని 13వ అంతస్తుల అక్షర హాసన్ కొనుగోలు చేశారు. ఈ ఫ్లాట్ కొనుగోలు చేయడం కోసం ఈమె ఏకంగా 15.75 కోట్ల రూపాయలు చెల్లించారని తెలుస్తుంది.

ఇక ఈ అపార్ట్మెంట్ కొనుగోలు చేయడం కోసం ఈమె స్టాంపు డ్యూటీ ఇతరత అన్ని కలిపి సుమారు 20 కోట్ల వరకు ఖర్చు అయి ఉంటుందని సమాచారం. అత్యంత ఖరీదైన ఈ ఫ్లాట్ అన్ని సౌకర్యాలను కలిగి ఉంది. ఎంతో విలాసవంతమైన ఈ ఫ్లాట్ అన్ని సౌకర్యాలతో కలిగి ఉండడమే కాకుండా ఏకంగా కార్ల పార్కింగ్ తో కూడుకుంది

అక్షర కం సినిమా ఇండస్ట్రీలో లేకపోయినా ఈమె ఏకంగా ఎన్ని కోట్ల రూపాయల విలువ చేసి ముంబైలో ఫ్లాట్ కొన్నారనే విషయం తెలియడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈమె సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఇతర వ్యాపార రంగాలలో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక శృతిహాసన్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus