Amala Paul: ఆ విషయంలో మారానన్న అమలాపాల్!

  • July 16, 2021 / 09:06 PM IST

తెలుగు, తమిళ భాషల్లో నటిగా మంచి పేరు సంపాదించుకున్న అమలాపాల్ ఈ మధ్య కాలంలో వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల ద్వారా వార్తల్లో నిలిచారు. కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఏ ఎల్ విజయ్ ను పెళ్లి చేసుకున్న అమలాపాల్ కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అమలాపాల్ మరో పెళ్లి చేసుకుంటారని వార్తలు వచ్చినా ఆ వార్తలు నిజం కాలేదు. మరోవైపు అమలాపాల్ కెరీర్ పై దృష్టి పెట్టి సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్నారు.

తాజాగా అమలా పాల్ నటించిన కుడి ఎడమైతే వెబ్ సిరీస్ ఆహా ఓటీటీ వేదికగా రిలీజైంది. అమలా పాల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రీల్ లైఫ్ లో ఎదుర్కొన్న విషయాలను రియల్ లైఫ్ లో కూడా ఎదుర్కొన్నానని అన్నారు. రియల్ లైఫ్ నుంచి వాటిని ఎలా వేరు చేయాలో తనకు అర్థం కాలేదని అమలాపాల్ చెప్పుకొచ్చారు. 2020 సంవత్సరంలో నాన్న చనిపోవడంతో ఆ సమయంలో కష్టాలు ఎదురయ్యాయని అమలాపాల్ అన్నారు.

కష్టాలు వచ్చిన సమయంలో లైఫ్ గురించి తప్పుగా అర్థం చేసుకున్నానని తనకంటూ స్పెషల్ లైఫ్ లేదని గ్రహించానని ఆమె అన్నారు. అయితే అప్పటికీ ఇప్పటికీ తన ఆలోచనలలో స్పష్టమైన మార్పులు వచ్చాయని ప్రస్తుతం తాను నిజ జీవితాన్ని, సినీ జీవితాన్ని వేరు చేసి ముందుకు సాగుతున్నానని పాత్రల ఎంపిక, సినిమాల ఎంపిక విషయంలో మారానని అమలాపాల్ తెలిపారు. ప్రస్తుతం నేను నేనుగా జీవిస్తున్నానని అమలా పాల్ చెప్పుకొచ్చారు.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus