తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!

మారుతున్న కాలానికి తగినట్టు ప్రతీ ఒక్కరు పంధా మార్చుకోవడం మామూలు విషయమే..! మన హీరోలు కూడా అదే విధంగా ఇప్పుడు వరుసగా పాన్ ఇండియా సినిమాల పై పడ్డారు. ఒక్క మహేష్ బాబు తప్ప.. ప్రస్తుతం స్టార్ హీరోలుగా చలామణి అవుతున్న పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రాంచరణ్, ఎన్టీఆర్ వంటి వారు పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నారు. అంతేకాదు విజయ్ దేవరకొండ, రామ్,అడివి శేష్ వంటి మీడియం రేంజ్ హీరోలు కూడా పాన్ ఇండియా ప్రాజెక్టులు సెట్ చేసుకున్నారు. తమ మార్కెట్ ను పెంచుకోవాలని ప్రతీ ఒక్కరు ఆరాట పడుతున్నారు. అయితే మన వాళ్ళ కంటే తమిళ హీరోలు ఈ స్టెప్ ఎప్పుడో తీసుకున్నారు. మన తెలుగు హీరోలను తమిళ ప్రేక్షకులు ఆదరించరు కానీ.. మన తెలుగు వాళ్ళు భాషతో సంబంధం లేకుండా కంటెంట్ ఉన్న ప్రతీ సినిమాని ఆదరిస్తుంటారు. అందుకే కోలీవుడ్ హీరోలు కూడా రాణిస్తున్నారు.

సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి డైరెక్ట్ తెలుగు సినిమాల్లో నటించిన హీరోలెవరో.. ఆ సినిమాలేంటో ఓ లుక్కేద్దాం రండి :

1)రజినీకాంత్ :

కె.బాలచందర్ తెరకెక్కించిన ‘అంతులేని కథ’, మోహన్ బాబు హీరోగా వచ్చిన ‘పెదరాయుడు’, పి.వాసు తెరకెక్కించిన ‘కథానాయకుడు’ వంటి స్ట్రైట్ తెలుగు సినిమాల్లో నటించారు రజినీ.

2)కమల్ హాసన్ :

‘అంతులేని కథ’, ‘అమరప్రేమ’, ‘సొమ్మొకడిది సోకొకడిది’,’ఇది కథ కాదు’, ‘గుప్పెడు మనసు’, ‘ఆకలి రాజ్యం’, ‘స్వాతి ముత్యం’ ‘ఇంద్రుడు చంద్రుడు’ వంటి ఎన్నో స్ట్రైట్ తెలుగు మూవీస్ లో నటించారు కమల్ హాసన్.

3)అజిత్ :

1993 లో వచ్చిన ‘ప్రేమ పుస్తకం’ అనే స్ట్రైట్ తెలుగు సినిమాలో నటించాడు అజిత్.

4)విక్రమ్ :

‘చిరునవ్వుల వరమిస్తావా’ ‘బంగారు కుటుంబం’ ‘ఆడాళ్ళా మజాకా’ ‘ఊహ’, ‘మెరుపు’, ‘9నెలలు’ వంటి తెలుగు సినిమాల్లో నటించాడు.

5)సిద్దార్థ్ :

‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ ‘బొమ్మరిల్లు’ ‘ఆట’ ‘చుక్కల్లో చంద్రుడు’ వంటి స్ట్రైట్ తెలుగు సినిమాల్లో నటించాడు.

6) విశాల్ :

‘సెల్యూట్’ అనే స్ట్రైట్ తెలుగు మూవీలో నటించాడు విశాల్.

7)సూర్య :

‘రక్త చరిత్ర’ ‘రక్త చరిత్ర2’ వంటి తెలుగు సినిమాల్లో నటించాడు.

8)ఆర్య :

అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘వరుడు’ అనే తెలుగు సినిమాలో నటించాడు.

9) అరుణ్ విజయ్ :

రాంచరణ్ హీరోగా వచ్చిన ‘బ్రూస్ లీ’ లో నటించాడు.

10)కార్తీ :

నాగార్జునతో కలిసి ‘ఊపిరి’ అనే తెలుగు సినిమాలో నటించాడు.

11)శివ కార్తికేయన్ :

ఐశ్వర్య రాజేష్, రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘కౌసల్య కృష్ణమూర్తి’ మూవీలో నటించాడు శివకార్తికేయన్.

12)అథర్వ మురళి :

వరుణ్ తేజ్ నటించిన ‘గద్దలకొండ గణేష్’ మూవీలో నటించాడు.

13)విజయ్ సేతుపతి :

‘ఉప్పెన’ అనే స్ట్రైట్ తెలుగు మూవీలో నటించాడు.

14) ధనుష్ :

శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్నాడు.

15)విజయ్ :

వంశీ పైడిపల్లి డైరెక్షన్లో ఓ స్ట్రైట్ మూవీ చేస్తున్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus