Amani, Chiranjeevi: పదిసార్లు ఫోన్ చేసి అడుక్కున్నా నో చెప్పానన్న ఆమని.. ఏ సినిమా అంటే?

  • March 29, 2024 / 12:21 PM IST

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సినిమాలో హీరోయిన్ ఛాన్స్ వస్తే ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేస్తారనే సంగతి తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న ఆమని (Aamani) ఒక సినిమాలో చిరంజీవికి జోడీగా ఛాన్స్ వచ్చినట్టే వచ్చి పోయిందని చెప్పుకొచ్చారు. చిరంజీవికి అక్కగా నటించే అవకాశం వచ్చినా ఆ అవకాశాన్ని నేను వదులుకున్నానని ఆమె కామెంట్లు చేయడం గమనార్హం. చిరంజీవికి జోడీగా నటించే ఛాన్స్ రాలేదని ఇప్పటికీ ఫీలవుతానని ఆమని పేర్కొన్నారు.

రిక్షావోడు సినిమాలో మొదట నేనే హీరోయిన్ గా ఎంపిక కావడం జరిగిందని ఆ సినిమాకు డైరెక్టర్ మారిపోవడంతో నాకు ఆ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ మిస్ అయిందని ఆమె తెలిపారు. చిరంజీవి సినిమాలో ఛాన్స్ మిస్ అయిన సమయంలో నేను చాలా ఏడ్చానని ఆమని కామెంట్లు చేశారు. స్టాలిన్ మూవీలో చిరంజీవికి అక్కగా పని చేసే ఛాన్స్ వచ్చిందని ఆమె తెలిపారు.

చిరంజీవి నా డ్రీం హీరో అని ఆయనను నేను తమ్ముడిగా ఊహించుకోలేక ఆ మూవీ ఆఫర్ ను రిజెక్ట్ చేశానని ఆమని అన్నారు. ఆ సినిమాలో నటించాలని పదిసార్లు ఫోన్ చేసినా తాను రిజెక్ట్ చేశానని ఆమె తెలిపారు. ఆ తర్వాత స్టాలిన్ సినిమాలో ఖుష్బూ (Khushbu) చిరంజీవి అక్క పాత్రలో నటించి మెప్పించడం గమనార్హం. స్టాలిన్ (Stalin) మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది.

చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర (Vishwambhara) సినిమాతో బిజీగా ఉండగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండటంతో ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తున్నారు. విశ్వంభర సినిమాలో యాక్షన్ సీన్స్ స్పెషల్ గా ఉండనున్నాయని సమాచారం అందుతోంది. విశ్వంభర సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుందని తెలుస్తోంది. విశ్వంభర సినిమా మెగా ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ లా ఉండబోతుందని భోగట్టా.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus