‘బేబీ బంప్’ తో ఫొటోలను షేర్‌చేసి చీట్ చేసిన ‘నువ్వు- నేను’ అనిత..!

దివంగత నటుడు ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన ‘నువ్వు నేను’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమయ్యింది అనిత. ఆ తరువాత అదే హీరోతో ‘శ్రీరామ్’ చిత్రంలో కూడా నటించింది. అటుతరువాత ‘తొట్టి గ్యాంగ్’ ‘అదంతే అదో టైపు’ ‘నేనున్నాను’ వంటి చిత్రాలలో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో బాలీవుడ్ కు చెక్కేసింది ఈ భామ. అక్కడ కూడా పెద్దగా ఆఫర్లు రాకపోవడంతో రియాలిటీ షోలు, సీరియల్స్‌లలో నటించి పాపులర్ అయ్యింది. ఈ క్రమంలో నటుడు రోహిత్ రెడ్డి తో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారడంతో పెళ్ళి చేసుకుంది.

ప్రస్తుతం హిందీ సీరియల్స్‌తో బిజీగా ఉన్న ఈ భామ ఇటీవలే ప్రెగ్నెంట్ అని, కవలలకు జన్మనివ్వబోతుందని వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ తాజాగా అనిత తన బేబీ బంప్‌తో కూడిన ఫొటోలను షేర్ చేసింది. అనిత తన సోషల్ మీడియా అకౌంట్‌ లలో ఈ ఫొటోలను షేర్‌చేసి ‘నేను ఫేక్ బేబీ బంప్‌తో ఫొటో షేర్ చేశాను. ఇక రియల్ బేబీ బంప్‌తో పాటు ఫొటో షేర్‌ చేస్తే ఎలావుంటుందో మరి’ అంటూ కామెంట్ పెట్టింది. ఇదిలా ఉండగా… ఇటీవల అనిత భర్త రోహిత్‌రెడ్డి కూడా ఓ వీడియోను షేర్‌ చేస్తూ అనిత ప్రెగ్నెన్సీ విషయాన్ని తెలియజేసాడు. అనిత కవలలకు జన్మనివ్వబోతుందని ఇందులో పేర్కొన్నాడు.అయితే ఇదంతా నిజం కాదండోయ్… ‘నాగిని 3’ అనే షూటింగ్లో ఇదో ఎపిసోడ్. ఇక త్వరలోనే రియల్ బేబీకి కూడా ఇలా జన్మనివ్వాలని కోరుకుంటున్నట్టు తెలిపింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus