మెగా పవర్ స్టార్ వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన హర్రర్ కామిడీ మూవీ ‘కొరియన్ కనకరాజు'(Korean Kanakaraju). ‘యూవీ క్రియేషన్స్’ ‘ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్’ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. రితికా నాయక్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో కమేడియన్ సత్య అత్యంత కీలక పాత్ర పోషించాడు. తమన్ సంగీత దర్శకుడు. హారర్ జోనర్ అంటే ఇష్టపడే ఆడియన్స్ ఎక్కువమందే ఉన్నారు. దీంతో మొదటి నుండి ఈ సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది.
ప్రమోషన్స్ లో భాగంగా వదిలిన టీజర్, ట్రైలర్ వంటివి ఆడియన్స్ ని మెప్పించాయి. మొదటి రోజు సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ ను రాబట్టింది. ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
| నైజాం | 2.65 cr |
| సీడెడ్ | 0.80 cr |
| ఆంధ్ర(టోటల్) | 2.72 cr |
| ఏపీ + తెలంగాణ (టోటల్) | 6.17 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.45 cr |
| ఓవర్సీస్ | 1.30 cr |
| వరల్డ్ వైడ్ టోటల్ | 7.92 cr(షేర్) |
‘కొరియన్ కనకరాజు’ చిత్రానికి రూ.11.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.12 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 2 రోజుల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.7.92 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.14.5 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కొరకు రూ.4.08 కోట్ల షేర్ ను కలెక్ట్ చేయాల్సి ఉంది.