Anjali: ఆ వార్తల్లో నిజమే లేదంటున్న అంజలి..?

  • April 4, 2021 / 08:48 PM IST

తెలుగమ్మాయి అంజలి కీలక పాత్రలో నటిస్తున్న వకీల్ సాబ్ సినిమా ఈ నెల 9వ తేదీన రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న అంజలి ప్రేమ, పెళ్లి లాంటి వ్యక్తిగత విషయాల గురించి స్పందించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కొన్నేళ్ల క్రితం తాను ప్రేమలో పడిన మాట వాస్తవమేనని కొన్ని రీజన్స్ వల్ల తాను లవ్ లో ఫెయిల్ అయ్యానని అంజలి అన్నారు. ఒకవేళ తన రిలేషన్ షిప్ సక్సెస్ అయ్యి ఉంటే ఆ వ్యక్తిని అభిమానులకు తాను పరిచయం చేసేదానినని అంజలి పేర్కొన్నారు.

లవ్ ఫెయిల్యూర్ అయితే ఆ బాధను తట్టుకోవడం ఎంతో కష్టమని అంజలి తెలిపారు. అమ్మ వల్లే లవ్ ఫెయిల్యూర్ బాధ నుంచి తాను బయటపడ్డానని అంజలి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తాను కెరీర్ పైనే పూర్తిగా దృష్టి పెట్టానని సమయం వస్తే కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని అంజలి అన్నారు. గతంలో తనకు పెళ్లై పిల్లలు పుట్టారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయని వైరల్ అయిన ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని అంజలి చెప్పుకొచ్చారు.

అంజలి గత సినిమా నిశ్శబ్దం తెలుగులో ఫ్లాప్ ఫలితాన్ని అందుకుంది. వకీల్ సాబ్ సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకోవడంతో పాటు తెలుగులో మళ్లీ బిజీ అవుతానని అంజలి భావిస్తున్నారు. వకీల్ సాబ్ సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాల్సి ఉంది. మరోవైపు వకీల్ సాబ్ సినిమాకు హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. రికార్డు స్థాయిలో థియేటర్లలో రిలీజ్ అవుతున్న వకీల్ సాబ్ కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని పవన్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus