తెలుగులో మంచి పేరు తెచ్చుకున్న అంజలి ప్రస్తుతం తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో క్రేజీ హీరోలతో నటిస్తూ బిజీ బిజీగా గడిపేస్తోంది. తెలుగులో వరుసగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్‌లకు వెబ్ సిరీస్ లు చేస్తున్న అంజలి తెలుగు సినిమాల్లో మళ్లీ రాణించాలని ప్రయత్నాలు చేస్తోంది. ఎంగయుమ్ ఎప్పోదుమ్ (జర్నీ) సినిమాతో తమిళ, తెలుగు భాషల్లోనూ మంచి పేరు తెచ్చుకుంది. ఆ మూవీ అందించిన సక్సెస్‌తో తెలుగులో వరుస ఆఫర్లని దక్కించుకుంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో అంజలి (Actress) తనకు కాబోయే వరుడి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తను ఎలా ఉండాలి? ..తనకు ఎలాంటి వరుడు కావాలో తెలిపింది. పెళ్లి గురించి, కాబోయే వరుడి గురించి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ అంజలి ఆసక్తికరంగా స్పందించింది.బరిలేషన్షిప్లో ఒకరి పట్ల ఒకరికి మర్యాద చాలా ముఖ్యం. ఆ తరువాతే ప్రేమ, అభిమానం అన్నీ అని తెలిపింది. అంతే కాకుండా మర్యాదలేని వ్యక్తితో సంబంధమే తనకు అవసరం లేదంది.
కెరీర్, రిలేషన్షిప్లో ఏది మీకు ముఖ్యమని అడిగితే మాత్రం తనకు రెండు ప్రధానమేనని తెలిపింది. ఇక తనకు కాబోయే వరుడికి మర్యాద తెలిసి ఉండాలని, అలాంటి వ్యక్తి కోసమే ఎదురు చూస్తున్నానని స్పష్టం చేసింది. గతంలో అంజలి జర్నీ ఫేమ్ జైతో ప్రేమలో ఉందని, ఇద్దరు పెళ్లికూడా చేసుకోబోతున్నారని వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. ఇక గతంలోనూ అంజలి ఈ విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. నీకెలాంటి భర్త కావాలని అంజలిని అడిగితే విరాట్ కోహ్లిలా మంచి హుషారుగా ఉండాలని, కోహ్లిలో ఉండే చురుకుదనం, అందం ఉండాలని టక్కున చెప్పేసింది అంజలి.
అంతేకాదు తనకు కాబోయే వాడు ఇంకా చాలా క్వాలిఫికేషన్స్ ఉండాలని, అసలు నున్నగా షేవ్ చేసుకోకూడదని, కేవలం ట్రిమ్ చేసుకోవాలని చెప్పింది. అంతేకాదు జీవితంలో ధృడమైన నిర్ణయాలు తీసుకోగలిగే మనస్తత్వం ఉండాలని, అలాంటి లక్షణాలున్న వ్యక్తి తనకు భర్తగా రావాలని కోరుకుంటున్నానని చెప్పింది. అయితే ఇన్ని లక్షణాలు ఉన్న వ్యక్తి మీకు ఎవరైనా ఎదురయ్యరా అంటే, తనకు కావాల్సిన వ్యక్తి తన కు ఇంకా దొరకలేదని చెప్పింది.
టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!