సినీ పరిశ్రమలో ఉన్న నటీనటులు వరుసగా పెళ్లిపీటలెక్కుతున్నారు. దిల్ రాజు (Dil Raju) సోదరుడి కొడుకు ఆశిష్(Ashish Reddy), నితిన్ (Nithiin) ‘ఎక్స్ట్రా’ (Extra: Ordinary Man) సినిమాలో విలన్ గా చేసిన సుదేవ్ నాయర్ (Sudhev Nair) ,స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh), సీనియర్ హీరోయిన్ అక్ష(Aksha Pardasany), బిగ్ బాస్ ఫేమ్ వాసంతి కృష్ణన్(Vasanthi Krishnan), హీరోయిన్ మీరా చోప్రా (Meera Chopra), సింగర్ హారికా నారాయణ్ (Harika Narayan) వంటి వారు పెళ్లి చేసుకుని కొత్త లైఫ్ ను స్టార్ట్ చేశారు. వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar) ,కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) వంటి స్టార్స్ కి కూడా ఎంగేజ్మెంట్ అయిన సంగతి తెలిసిందే.
తాజాగా మరో నటి కూడా సైలెంట్ గా పెళ్లి చేసుకుంది షాక్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే.. మలయాళ ముద్దుగుమ్మ అపర్ణ దాస్ (Aparna Das) సైలెంట్ గా పెళ్లి చేసుకుంది. ‘బీస్ట్’ (Beast) ‘ఆదికేశవ’ (Aadikeshava) వంటి సినిమాలతో పాపులర్ అయిన ఈమె ‘మంజుమ్మల్ బాయ్స్’ తో (Manjummel Boys) బాగా పాపులర్ అయిన నటుడు దీపక్ పరంబోల్ తో (Deepak Parambol) ఏప్రిల్ 24న బుధవారం నాడు మూడు ముళ్ళు వేయించుకుంది. సాధారణంగా సినీ పరిశ్రమలో ఉండే యంగ్ హీరోయిన్స్ 30 దాటితేనే కానీ పెళ్లి చేసుకోరు.
కానీ అపర్ణ దాస్ 28 ఏళ్లకే పెళ్లి చేసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతం అపర్ణ దాస్- దీపక్ పరంబోల్ పెళ్లి ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన వారి ఫాలోవర్స్ ‘కంగ్రాట్యులేషన్స్’ ‘హ్యాపీ మ్యారీడ్ లైఫ్’ అంటూ తమ బెస్ట్ విషెస్ ను తెలియజేస్తున్నారు. మరోపక్క ‘ ‘అపర్ణ దాస్ పెళ్లయ్యాక’ సినిమాలు కంటిన్యూ చేస్తుందా? లేదా?’ అంటూ కూడా కామెంట్లు పెడుతున్నారు.