తల్లైన సీరియల్ నటి.. ఎమోషనల్ పోస్ట్ వైరల్

సినిమా వాళ్ళతో సమానంగా సీరియల్ నటీనటులకు కూడా మంచి క్రేజ్ ఉంటుంది. ఎందుకంటే సినిమా వాళ్ళు గట్టిగా వారానికి ఒకసారి మాత్రమే తమ సినిమాలతో ప్రేక్షకులని పలకరిస్తారు. కానీ సీరియల్ నటీనటులు మాత్రం ప్రతిరోజు ప్రసారమయ్యే ఎపిసోడ్స్ తో ప్రేక్షకులను పలకరిస్తారు. ముఖ్యంగా వీళ్ళకి ఫ్యామిలీ ఆడియన్స్ క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. మరోపక్క వీళ్ళకి సోషల్ మీడియాలో కూడా మంచి క్రేజ్ ఏర్పడుతుంది. వీళ్ళకి సంబంధించిన ఫోటోలు మాత్రమే కాదు, వీళ్ళ పర్సనల్ లైఫ్ కి సంబంధించిన అప్డేట్స్ కూడా వైరల్ అవుతూ ఉంటాయి.

బుల్లితెర నటి మహేశ్వరి అందరికీ సుపరిచితమే. ‘వదినమ్మ’, ‘శశిరేఖా పరిణయం’ వంటి సీరియల్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత… ఈమె దర్శకుడు శివనాగుని ప్రేమించి పెళ్లి చేసుకుంది. మహేశ్వరి, శివనాగు..ల జంట.. ‘ఇస్మార్ట్ జోడీ’, ‘ఫ్యామిలీ నంబర్ 1 ‘ వంటి షోల్లో పాల్గొని అందరినీ ఆకట్టుకున్నారు. వీరిద్దరికీ హరిణి అనే కుమార్తె ఉంది. ఇదిలా ఉండగా.. తాజాగా మహేశ్వరి రెండోసారి తల్లి అయ్యింది. మంగళవారం నాడు ఆమెకు పండంటి బిడ్డ జన్మనిచ్చింది.

ఈ విషయాన్ని స్వయంగా ఆమె తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. అయితే ఆమెకు జన్మించింది… ‘ఆడపిల్ల?, మగ బిడ్డ?’ అనే విషయం పై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.కేవలం ఆ బేబీ చేతులు పట్టుకుని తీసిన ఫోటోని మాత్రమే ఆమె షేర్ చేయడం జరిగింది.ఇక ఆమె పోస్ట్ చూసిన తోటి నటీనటులు… మహేశ్వరి, శివనాగు..లకి కంగ్రాట్స్ చెబుతూ కామెంట్లు పెడుతున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus