Bunny Vasu: నటి సునీత బోయని అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు..!

  • July 14, 2021 / 05:49 PM IST

మీడియం రేంజ్ సినిమాలను నిర్మించి.. వాటితో పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్లు కొడుతుంటారు నిర్మాత బన్నీ వాసు.ఈయన సాధ్యమైనంత వరకు మీడియాకి, కాంట్రవర్సీలకు దూరంగా ఉండడానికే ఇష్టపడుతుంటారు. అయితే కొన్నాళ్లుగా ఇతన్ని బెదిరిస్తూ ఇబ్బంది పెడుతుంది నటి సునీత బోయ.తాజాగా ఈమెను హైదరాబాద్… జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేయడం హాట్ టాపిక్ అయ్యింది. 2019 నుండీ ఈమె బన్నీ వాస్ ఆఫీస్ కి వెళ్లి రచ్చ రచ్చ చేస్తుంది. అంతేకాదు ఫేస్ బుక్‌లోనూ,

అలాగే సోషల్ మీడియాలో కొన్ని వీడియోల ద్వారా కూడా బన్నీ వాస్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తుండడం మనం చూస్తూనే వస్తున్నాం. కేవలం పబ్లిసిటీ కోసమే ఇలాంటివి చేస్తుందా లేక ఈమె వెనుక ఎవరైనా ఉండి.. ఈ తతంగం అంతా నడిపిస్తున్నారా అనేది అర్ధం కాని ప్రశ్న. సునీత… బన్నీ వాస్ పై మోపిన ఆరోపణ గురించి అందరికీ తెలిసే ఉండుంటుంది. ‘ఈమెకు తన సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని చెప్పి.. ఇప్పుడు మొహం చాటేస్తున్నాడు బన్నీవాసు’ అన్నది సునీత వాదన.

‘గీతా ఆర్ట్స్’ కార్యాలయం వద్ద ఈమె పెద్ద రచ్చ చేసింది. చివరకు సూసైడ్ చేసుకునే వరకు కూడా వెళ్ళింది. అందుకే బన్నీవాస్ ఆఫీస్ వాళ్లు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు.వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సునీతని అరెస్ట్ చేశారు. గతంలో కత్తి మహేష్ పై కూడా అనేక ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus