Asin: మీ అద్బుతమైన 5 నిమిషాలను వృదా చేసుకోకండి హీరోయిన్ ఆసిన్!

  • June 29, 2023 / 07:48 AM IST

హీరోయిన్ ఆసిన్ మలయాళ చిత్రం నరేంద్రన్ మకాన్ జయకాంతన్ వకాతో సినిమాల్లో అడుగుపెట్టింది. అయితే గజినీ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్‌ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అమాయకంగా కనిపించిన హీరోయిన్ ఆసిన్. కల్పనా శెట్టి పాత్రలో మెప్పించి అభిమానులను సంపాదించుకుంది. తమిళం, తెలుగు, మలయాళ, హిందీ భాషల్లోనూ నటించింది. ఆ తర్వాత గజినీతో పాటు రెడీ, హౌస్‌ఫుల్ 2, బోల్ బచ్చన్, ఖిలాడీ 786తో పాటు.. చివరిసారిగా 2015లో ఆల్‌ ఈజ్‌ వెల్‌ చిత్రంలో కనిపించింది.

ఆ తర్వాత 2016లో మైక్రోమ్యాక్స్ సహ వ్యవస్థాపకుడు రాహుల్‌ను పెళ్లి చేసుకుంది. 2017లో వీరికి ఓ కుమార్తె కూడా జన్మించింది. పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పిన భామ.. చాలా రోజుల తర్వాత వార్తల్లో నిలిచింది. ఎందుకంటే ఆమె తన భర్తతో విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. అసిన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి ఒక్కటి మినహా రాహుల్‌తో ఉన్న అన్ని ఫోటోలను తొలగించింది. దీంతో డైవర్స్ అంటూ రూమర్స్ మొదలయ్యాయి.

ఆమె తన సోషల్ మీడియా ప్రొఫైల్ నుంచి తన పెళ్లి ఫోటోలను కూడా తొలగించింది. ఇన్‌స్టాలో ఆమె చివరి పోస్ట్ కుమార్తె అరిన్ ఐదో పుట్టినరోజు సందర్బంగా అక్టోబర్ 2022లో చేసింది. ఇంతవరకు ఆమె ఎలాంటి ఫోటోలను షేర్ చేయలేదు. దీంతో ఈ జంట త్వరలోనే విడాకులు తీసుకోనుందని సోషల్ మీడియాలో తెగ చర్చ మొదలైంది. అంతే కాకుండా ఆసిన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో తన భర్తతో ఉన్న ఒక ఫోటోను మాత్రమే ఉంచింది. ఈ నేపథ్యంలో ఆ వార్తలపై ఆసిన్ స్పందించింది.

తనపై డైవర్స్ వార్తలకు చెక్ పెట్టింది (Asin) ఆసిన్. వివరణ ఇస్తూ బుధవారం తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌సో ఓ నోట్ రాసుకొచ్చింది. ‘ రాహుల్‌తో కలిసి వేసవి సెలవులను ఎంజాయ్ చేస్తున్నా. మాపై వస్తున్న చాలా వార్తలు పూర్తిగా నిరాధారం. ఈరోజు మేమిద్దరం కూర్చుని బ్రేక్‌ఫాస్ట్ కూడా తిన్నాం. మేం విడిపోతున్నామనే ఒక బేస్ లెస్ వార్త విన్నా.

ప్రస్తుతం మా కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లోనే సమయాన్ని ఆస్వాదిస్తున్నా. దయచేసి వినండి. ఇప్పుడు దీని కోసం మీ 5 నిమిషాల అద్భుతమైన సమయాన్ని వృధా చేసినందుకు నిరాశ చెందుతున్నా.’ అంటూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆసిన్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. తనపై వస్తున్న రూమర్స్‌కు చెక్ పెట్టింది హీరోయిన్ ఆసిన్

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus