Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

రజనీకాంత్ – అశ్వత్‌ మరిముత్తు కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘ధర్మన్‌’ అనే పేరు పెట్టారు. తెలుగులో ఇదే పేరు పెడతారా.. లేక తెలుగు కోసం ‘ధర్మ’ అనే పేరు ట్రై చేస్తారో లేదో తెలియదు. ఆ విషయం పక్కన పెడితే.. ఈ సినిమా కాస్టింగ్‌ గురించి కొత్తగా వచ్చిన కొన్ని వార్తలు ఆసక్తికరంగా ఉన్నాయి. రామ్‌ విషయమేగా.. ఆల్‌ రెడీ ఆయన క్యారెక్టర్‌ షూటింగ్‌ మొదలైంది కదా అనుకుంటున్నారా? ఇప్పుడు చెప్పబోయేది ఆ విషయం కాదు.

Rajinikanth

‘ధర్మన్‌’ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు వచ్చిన సమాచారం చూస్తే.. ఇందులో రజనీకాంత్‌, సిమ్రన్‌, రాశీఖన్నా నటిస్తున్నారు. ఈ విషయం తప్ప ఇంకే విసయాలు చిత్రబృందం చెప్పలేదు. అయిత ఈ సినిమాలో రజనీకాంత్‌కి అల్లుడి పాత్రలో రామ్‌ పోతినేని నటిస్తున్నారు అని ఆ మధ్య వార్తలొచ్చాయి. అయితే ఈ విషయంలో ఇంకా ఎక్కడా క్లారిటీ లేదు. కానీ ఇటీవల రామోజీ ఫిల్మ్‌ సిటీలో జరిగిన ఓ షెడ్యూల్‌ షూటింగ్‌లో రామ్‌ కూడా పాల్గొన్నాడని సమాచారం.

అయితే, ఇప్పుడు సినిమా మైసూరులో చిత్రీకరణ జరుపుకుంటోంది. దీనికి సంబంధించి వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆ సంగతి తర్వాత చూద్దాం. ఈ షెడ్యూల్‌ తర్వాత మరోసారి రామ్‌ పోతినేని ఈ సినిమా సెట్స్‌లో అడుగుపెడతాడట. అప్పుడు శ్రీలీల కూడా ఆయనతోపాటు కలుస్తారట. మరి ఇద్దరూ పెయిర్‌గా నటిస్తారా లేక వేర్వేరు పాత్రలా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ కాంబోగా నటిస్తే రెండోసారి అవుతుంది.

గతంలో ఇద్దరూ కలసి ‘స్కంద’ సినిమాలో కలసి నటించారు. ఆ సినిమా ఫలితం ఇబ్బందికరంగా వచ్చింది. కానీ ఈ ఇద్దరి జోడీకి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. కాబట్టి ఈ సినిమాకు వీరి కాంబో ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఈ సినిమాకు సంబంధించి ఈ అప్‌డేట్స్‌ ఎప్పుడు ఇస్తారో చూడాలి. ఇక పైన చెప్పిన వైరల్‌ వీడియో సంగతికి వస్తే.. సినిమా సెట్స్‌కి ఆటోలో వచ్చారు రజనీకాంత్‌. అందుకే వీడియో వైరల్‌ అయ్యింది.

 

అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus