Genelia: పిల్లలతో కలిసి సినిమాలు చూడలేకపోతున్నాం: జెనీలియా

  • July 22, 2023 / 12:07 PM IST

బొమ్మరిల్లు సినిమాలోని హాసినిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి జెనీలియా తెలుగులో పలు సినిమాలలో నటించిన అనంతరం ఈమె పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు. ఇలా జెనీలియా బాలీవుడ్ నటుడు రిషితేష్ దేశ్ ముఖ్ అనే నటుడిని వివాహం చేసుకొని వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు. ఇలా పెళ్లయిన వెంటనే ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చినటువంటి జెనీలియా కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ పిల్లల ఆలనా పాలన చూసుకున్నారు. ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఈమె తిరిగి ఇండస్ట్రీ లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు.

ఈ క్రమంలోనే పలు సినిమాలు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు పలు వెబ్ సిరీస్ ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే జెనీలియా కూడా ట్రయల్ పీరియడ్ అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ వెబ్ సిరీస్ జులై 21 నుంచి ఓటీటీ ‘జియో సినిమా’ వేదికగా స్ర్టీమింగ్‌ కానుంది.

ఈ సందర్భంగా జెనీలియా (Genelia) మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలను తెలియచేశారు. సాధారణంగా నేను ఏదైనా ఒక సినిమాకు కమిట్ అవ్వాలంటే కథ చదవటానికి చాలా సమయం తీసుకుంటాను కానీ ఈ వెబ్ సిరీస్ కేవలం గంటలోనే చదివేసి ఓకే చెప్పానని తెలిపారు. తన రీ ఎంట్రీ ఇలాంటి ఒక అద్భుతమైన కథతో రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఇందులో తాను ఒంటరి మహిళగా కనిపిస్తానని అయితే ఈ సిరీస్ కుటుంబం మొత్తం కలిసి చూసేలాగా ఉంటుందని తెలిపారు.

ప్రస్తుత కాలంలో ఓటీటీలో వస్తున్న సినిమాలు కానీ వెబ్ సిరీస్ లో కానీ పిల్లలతో కలిసి చూసే విధంగా లేవని అందుకే కుటుంబం అంతా కలిసి చూసేలా ఉండే ‘ట్రయల్‌ పీరియడ్‌’ కథను ఎంచుకున్నాను అంటూ ఈ సందర్భంగా జెనీలియా ఓటీటీల గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus