Hidimba Review in Telugu: హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

  • July 20, 2023 / 11:20 AM IST

Cast & Crew

  • అశ్విన్ బాబు (Hero)
  • నందితా శ్వేత (Heroine)
  • శుభలేఖ సుధాకర్, సంజయ్ స్వరూప్, శ్రీనివాస్ రెడ్డి, రఘు కుంచె, ఛత్రపతి శేఖర్ (Cast)
  • అనిల్ కన్నెగంటి (Director)
  • గంగపట్నం శ్రీధర్ (Producer)
  • వికాస్ బాడిసా (Music)
  • రాజశేఖర్ బి (Cinematography)

ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు హీరోగా ‘మిస్టర్ నూకయ్య’ వంటి డిఫరెంట్ మూవీని అందించిన అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘హిడింబ’. థియేట్రికల్ ట్రైలర్‌, రివర్స్ ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. దీంతో ఈ చిత్రం పై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. కాబట్టి ఈ వీకెండ్ కి రిలీజ్ అయ్యే సినిమాల్లో ఆడియన్స్ ఫస్ట్ టార్గెట్ ఇదే.నెల రోజుల పాటు సెన్సార్ సమస్యలు ఫేస్ చేసి.. రిలీజ్ వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ మొత్తానికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులని ఎంత వరకు ఆకట్టుకుందో ఓ లుక్కేద్దాం రండి :

కథ: ఆద్య(నందిత సీత) అభయ్(అశ్విన్ బాబు) ఇద్దరూ లవర్స్. కొన్ని కారణాల వల్ల విడిపోతారు. కానీ వీళ్ళు పోలీసులు అయిన తర్వాత మళ్ళీ కలుస్తారు. నగరంలో జరుగుతున్న సీరియల్ కిడ్నాప్ ల కేసును సాల్వ్ చేయడం కోసం డిపార్ట్మెంట్ వీరికి బాధ్యతలు అప్పగిస్తుంది. అలా వీళ్ళు ఈ కేసును కలిసి ఇన్వెస్టిగేట్ చేసి ఓ ముఠాని పట్టుకుంటారు. దీంతో కేసు సాల్వ్ అయిపోయింది అనుకుంటారు. కానీ ఆ ముఠా కిడ్నాప్ చేసిన అమ్మాయిలకి మిస్ అయిన అమ్మాయిలకి నగరంలో మిస్ అయిన అమ్మాయిలకి సంబంధం ఉండదు.

హంతకుడు రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిలనే కిడ్నాప్ చేస్తున్నట్టు ట్రైలర్లో చూపించారు. దీంతో ఆద్య ఓ సీక్రెట్ ఆపరేషన్ చేస్తుంది. కానీ అది ఫెయిల్ అవుతుంది.అదే టైంలో పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఓ అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. అందువల్ల ఆద్య సస్పెండ్ అవుతుంది. అసలు ఈ కిడ్నాప్ లకు పాల్పడుతున్న నరరూప రాక్షసులు ఎవరు? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

నటీనటుల పనితీరు: అశ్విన్ బాబు గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో కొత్తగా కనిపించాడు. ఫైట్స్ బాగా చేశాడు.కాలాబండా ఫైట్ , కేరళలో తీసిన ఫైట్స్ లో అశ్విన్ మెప్పిస్తాడు.మాస్ ఆడియన్స్ ను కూడా అవి బాగా మెప్పిస్తాయి. ఈ సినిమా కోసం అతను బాడీ పెంచి పవర్ ఫుల్ లుక్ లోకి మారాడు.కాకపోతే ఇలాంటి పాత్రకి వాయిస్ ఇంకా లౌడ్ గా ఉంటే బాగుండేది. ఫైట్స్ లో అతను అరుస్తున్న టైంలో వాయిస్ లౌడ్ గా లేదు.. అని అనిపించడమే కాకుండా ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఎందుకు అనేందుకు అది కారణమవుతుంది. నందితా శ్వేత గతంలో చేసిన పాత్రలే ఈ సినిమాలోనూ చేసింది.

తన వరకు బాగానే చేసింది. అంతకు మించి ఈమె గురించి చెప్పుకోవాలి అంటే.. గతంలో లేని విధంగా ఈ సినిమాలో బెడ్రూం సీన్, లిప్ లాక్ సీన్స్ చేసింది. సంజయ్ స్వరూప్ కూడా తనకు అలవాటైన సెటిల్డ్ రోల్ నే చేశాడు. బాగానే చేశాడు. శ్రీనివాస్ రెడ్డి పాత్ర కూడా అంతే..! రఘు కుంచె బాగానే చేశాడు. కాకపోతే అతని పాత్రకి ఎక్కువ స్క్రీన్ స్పేస్ దక్కలేదు. ఛత్రపతి శేఖర్, విద్యుల్లేఖ వంటి వారు కూడా తమకు అలవాటైన పాత్రల్లో పర్వాలేదు అనిపించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు: ‘అసాధ్యుడు’ ‘మిస్టర్ నూకయ్య’ వంటి చిత్రాలతో హిట్ కొట్టడానికి ట్రై చేసినా అనిల్ ఎందుకో దానికి పావు కిలో మీటర్ ముందే ఆగిపోయాడు. దీంతో చాలా కసితో ఈ కథ రాసుకున్నట్టు ఉన్నాడు. అయితే ఫస్ట్ హాఫ్ ను అతను నడిపించిన తీరు పెద్దగా ఆకట్టుకోదు. ఇంటర్వెల్ సీన్ మాత్రం ఓ పక్క భయపెడుతూనే మరోపక్క కడుపులో తిప్పేసేలా చేశాడు. సెకండ్ హాఫ్ కోసం అతను దాచి పెట్టుకున్న ట్విస్ట్ లు బాగున్నాయి. కేరళ ఫైట్ కూడా అతను డిజైన్ చేసుకున్న తీరు బాగుంది. కాకపోతే థ్రిల్లర్ సినిమాలకి లాజిక్కులు చాలా ముఖ్యం.

ఆ విషయంలో మాత్రం ఇతను బ్యాలన్స్ తప్పాడు. హీరోయిన్ ను సిటీ దాటి వెళ్ళకూడదు అని సస్పెన్షన్ టైంలో చెప్పినా ఆమె కేరళ వెళుతుంది. అలాగే సినిమా స్టార్టింగ్లో అవయవాల స్కామ్ గురించి పెట్టిన ఇష్యు సాల్వ్ అయినట్టు చూపించలేదు. వికాస్ బాడిసా బ్యాక్ గ్రౌండ్ … రాజశేఖర్ బి సినిమాటోగ్రఫీ సినిమాకి ఆయువు పట్టు అని చెప్పాలి. వాటి విషయంలో స్పెషల్ కేర్ తీసుకున్నందుకు.. నిర్మాతలను మెచ్చుకోవలసిందే.

విశ్లేషణ: ‘హిడింబ’ ఫస్ట్ హాఫ్ ఫ్లాట్ గా సాగినా.. సెకండ్ హాఫ్ పర్వాలేదు అనిపిస్తుంది. థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చే అవకాశాలు ఎక్కువే ఉన్నాయి.

రేటింగ్ : 2.75/5

Click Here To Read in ENGLISH

Rating

2.75
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus