హన్సిక మోత్వాని పరిచయం అవసరం లేని పేరు బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె అనంతరం హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఇలా ఈమె హీరోయిన్గా అల్లు అర్జున్ సరసన దేశముదురు సినిమాలో నటించి ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అయితే మొదటి సినిమానే ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఈ ముద్దుగుమ్మకు తెలుగు తమిళ భాషలలో అవకాశాలు వెల్లు వెత్తాయి. ఇలా ఒకానొక సమయంలో తెలుగు తమిళ భాషలలో అగ్రతారగా ఓ వెలుగు వెలిగినటువంటి హన్సికకు ఈ మధ్యకాలంలో కాస్త సినిమా అవకాశాలు తగ్గిపోయాయి అని చెప్పాలి.
ఈ విధంగా సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో ఈమె బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టారు.ఇలా తన బిజినెస్ పార్టనర్ అయినటువంటి సోహైల్ కతురియా అనే వ్యక్తిని గత ఏడాది చివరిలో వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. వివాహం తర్వాత ఈమె సినిమాలకు దూరమవుతుంది అంటూ ఎన్నో వార్తలు వచ్చాయి కానీ తనుకు అవకాశాలు వస్తే తప్పకుండా సినిమాలలో నటిస్తానని చెప్పిన హన్సిక ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉన్నారు.
అయితే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె (Hansika) కెరియర్ మొదట్లో తనకు ఎదురైనటువంటి చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చారు..కెరీర్ మొదట్లో బాలీవుడ్ ఇండస్ట్రీలో డిజైనర్స్ దగ్గర తాను ఘోరంగా అవమానం పొందానని తెలిపారు. బాలీవుడ్ డిజైనర్స్ సౌత్ సెలబ్రిటీలు అంటే చాలా చులకన భావన ఉండేదని తెలిపారు. తాను సౌత్ సెలబ్రిటీ కావడంతో కనీసం తనకు డిజైనర్ దుస్తులు ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదని ఈమె తెలియజేశారు.
అయితే తను మాత్రం తన నటనతో తన ప్రతిభను బయట పెట్టడంతో నా టాలెంట్ గుర్తించిన వారే ప్రస్తుతం ఏదైనా కార్యక్రమాలకు తమ డిజైనర్ దుస్తులు వేసుకోవాలని బ్రతిమిలాడుతున్నారు అంటూ ఈ సందర్భంగా హన్సిక చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!