Hansika: స్టార్ డైరెక్టర్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన హన్సిక!

  • June 29, 2023 / 08:13 AM IST

అంత చిన్న వయస్సులోనే హీరోయిన్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన హన్సిక, ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడం తో మళ్ళీ ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. హిట్టు మీద హిట్టు కొడుతూ చూస్తూ ఉండగానే ఎవ్వరూ అందుకోలేని రేంజ్ కి చేరిపోయింది. ఈమె తొలిసినిమా తెలుగు లోనే, కానీ ఎక్కువ గా తమిళ సినిమాల్లోనే హీరోయిన్ గా నటించింది. సక్సెస్ రేషియో కూడా ఆమెకి అక్కడే ఎక్కువ ఉంది.

ఇది ఇలా ఉండగా రీసెంట్ గానే జరిగిన ఒక ఇంటర్వ్యూ లో తన మొదటి సినిమా దేశముదురు కి సంబంధించిన కొన్ని జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. యాంకర్ హన్సిక ని ఒక ప్రశ్న అడుగుతూ, ‘అతి చిన్న వయస్సులోనే మీరు ఈ స్థాయికి వచ్చారు కదా,మీకు ఎలా అనిపిస్తుంది?’ అని అడిగిన ప్రశ్నకి హన్సిక సమాధానం చెప్తూ ‘అది నా అదృష్టం, దేశముదురు సినిమా సమయానికి నాకు 16 సంవత్సరాలు మాత్రమే నిండాయి, ఇంకా 17 వ సంవత్సరం లోకి కూడా అడుగుపెట్టలేదు.

కానీ నాకు అప్పటికీ నా సొంత డబ్బులతో కారు కొనుక్కోగలిగాను, ఇల్లు కట్టుకున్నాను’ అని చెప్పుకొచ్చింది. ఇక దేశముదురు సినిమాలో అవకాశం ఎలా వచ్చిందో చెప్పుకుంటూ ‘ఈ సినిమాలో నాకు అవకాశం మెహర్ రమేష్ వల్లే వచ్చింది. ఆయన లేకపోతే నా జీవితం ఈరోజు ఇలా ఉండేది కాదు, పూరి సార్ అప్పుడే తన సినిమాలో హీరోయిన్స్ కోసం కొత్తవాళ్ళని ఆడిషన్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నాడు.

కానీ మెహర్ రమేష్ ఈ అమ్మాయి చైల్డ్ ఆర్టిస్టుగా చాలా చక్కగా చేసింది సార్, మన సినిమాకి పెర్ఫెక్టుగా ఉంటుంది అనడం తో ఫోటో షూట్ చేసి వెంటనే తన సినిమాలో తీసేసుకున్నాడు’ అని చెప్పుకొచ్చింది హన్సిక.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus