Hebah Patel: హెబ్బా పటేల్ .. బ్యూటిఫుల్ శారీ పిక్స్ వైరల్..!

‘అల ఎలా’ చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ముంబై బ్యూటీ హెబ్బా పటేల్.. తొలి చిత్రంతోనే డీసెంట్ హిట్ అందుకుని అటు తర్వాత సుకుమార్ నిర్మించిన ‘కుమారి 21ఎఫ్’ లో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. తర్వాత ఈమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ‘ఈడో రకం ఆడో రకం’ ‘ఎక్కడికి పోతావ్ చిన్నవాడా’ ‘నాన్న నేను బాయ్ ఫ్రెండ్స్’ వంటి హిట్ చిత్రాలతో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది.

అయితే అటు తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో చేసిన ‘మిస్టర్’ మూవీ నుండీ ఈమెను ఫ్లాప్ లు వెంటాడాయి. తర్వాత గ్లామర్ డోస్ పెంచి చేసిన ’24 కిస్సెస్’ కూడా ఈమె అంచనాలు తలకిందులు చేసింది. ఇప్పుడైతే ఈమెకు పెద్దగా ఆఫర్లు రావడం లేదు. ‘భీష్మ’ ‘రెడ్’ ‘ఒరేయ్ బుజ్జిగా’ వంటి సినిమాల్లో స్పెషల్ రోల్స్ తో సరిపెట్టుకుంది. ఆమె డీ గ్లామరస్ గా కనిపించిన ‘ఓదెల రైల్వే స్టేషన్’ ఓటీటీలో రిలీజ్ అయ్యి పర్వాలేదు అనిపించింది.

మరోపక్క ఈమె గ్లామరస్ ఫోటో షూట్లలో పాల్గొంటూ.. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ఇటీవల ఈమె శారీలో పాల్గొన్న ఓ ఫోటో షూట్ కు సంబంధించిన పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.ఇందులో ఆమె ఇచ్చిన ఫోజులు కూడా ఆకర్షించే విధంగా ఉన్నాయి. మీరు కూడా వాటిని ఓ లుక్కేయండి :

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus