ఆ నెటిజన్ పై ఓ రేంజ్లో ఫైరయిన హేమ….!

  • April 27, 2020 / 02:44 PM IST

లాక్ డౌన్ కారణంగా అందరూ ఇంట్లోనే ఉంటూ.. వస్తున్నారు. సెలబ్రిటీలు సైతం ఇంట్లోనే ఉంటూ వారి అభిమానులను అలరించడానికి లైవ్ లోకి వస్తున్నారు. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా లైవ్ లు పెడుతున్నారు… కొందరు కొత్త వంటలు నేర్పుతాం అని మరికొందరు చిట్కాలు చెప్పడానికి లైవ్ లో పెడుతున్నారు. ఇప్పుడు సీనియర్ ఆర్టిస్ట్ హేమ కూడా ఓ ఆయిల్ తయారి విధానం తెలుపుతూ ఓ లైవ్ వీడియో చేసింది. ఆ సమయంలో కొందరు తుంటరి మూక హేమ పై సెటైర్ లు వెయ్యడం మొదలు పెట్టారు.

మీ వయసు ఎంత మేడం? యూ ఆర్ సో ప్రెట్టి మేడం… వంటి కామెంట్స్ కొందరు నెటిజన్లు చేస్తుంటే.. మరో అతి ఉత్సాహం కలిగిన నెటిజన్ ఏకంగా ముద్దు పెడతారా మేడం అంటూ కామెంట్.. చేసాడు. వీటికి హేమ చాలా ఘాటు.. కామెంట్స్ చేసింది. నా వయసు తెలుసుకుని ఏం చేస్తావ్ రా.. నన్ను పెళ్ళి చేసుకుంటావా? నీ ప్రెట్టి గా ఉండకపోవడానికి నాకు 60, 70 ఏళ్ళు వయసు ఉందనుకున్నావా..? అంటూ ఘాటుగా వారి స్టైల్ లోనే సమాధానమివ్వగా…

ఆ ముద్దు అడిగిన నెటిజన్ కు …’తిక్క తిక్క వేషాలు వేస్తే … పళ్ళు రాలగొట్టి చేతిలో పెడతా’ అంటూ కామెంట్స్ చేసింది హేమ. ఇక మరో నెటిజన్ ‘బిగ్ బాస్’ వల్ల మీకు ఎంత వరకూ కలిసొచ్చింది అనుకుంటున్నారు.. అని మరో నెటిజన్ ప్రశ్నించగా..’నేనేమైనా కొత్త ఆర్టిస్ట్ నా… 30 ఏళ్ళ నుండీ ఇండస్ట్రీ లో ఉంటున్నాను. నాకు రావాల్సిన గుర్తింపు ఎప్పుడో వచ్చింది. సరదాగా బిగ్ బాస్ కు వెళ్ళాను. ఎంజాయ్ చేశాను. వచ్చేసాను’ అంతే…’ అంటూ చాలా మాస్ గా సమాధానం ఇచ్చింది.

Most Recommended Video

తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus