తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు

పులి కడుపున పులే పుడుతుంది అనేది సామెత. తల్లిదండ్రుల లక్షణాలతో పాటు, వారి తెలివితేటలు పిల్లలకు సంక్రమిస్తాయి అనే సైంటిఫిక్ సిద్ధాంతానికి అందరికీ తెలిసిన అర్థమే ఆ సామెత. మన టాలీవుడ్ కి చెందిన కొందరు టాలెంటెడ్ డైరెక్టర్స్ కూతుళ్లు , ఇది వందకు వంద శాతం రుజువని నిరూపిస్తున్నారు. ఈ దర్శకధీరుల పుత్రికా రత్నాలు అప్పుడే వివిధ రంగాలలో దూసుకుపోతున్నారు. మరి ఆ సూపర్ డాటర్స్ ఎవరో తెలుసుకుందామా..?

పూరి – పవిత్ర : డైనమిక్ అండ్ డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కూతురు పవిత్ర పూరి లేడీ డైరెక్టర్ అవ్వాలనే ప్రణాళికలో ఉన్నారట. ఇప్పటికే ఈ శాఖలో నైపుణ్యం సంపాదించే పనిలో ఆమె ఉన్నారట. దర్శకత్వ కోర్సులు అభ్యసించడంతో పాటు, తన తండ్రి పూరి దగ్గర మెళుకువలు నేర్చుకుంటుందట. పవిత్ర పూరి చైల్డ్ ఆర్టిస్టుగా పూరి దర్శకత్వం వహించిన కొన్ని చిత్రాలలో కనిపించారు. లేడీ డైనమిక్ డైరెక్టర్ గా పవిత్ర పూరి ఎదగడం ఖాయం అనిపిస్తుంది. ఇక సోషల్ మీడియాలో సైతం సూపర్ ఫాలోయింగ్ తో ఈ అమ్మడు దూసుకుపోతుంది.

సుకుమార్ – సుకృత : టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృత చిన్న వయసులోనే తాను టాలెంటెడ్ డైరెక్టర్ కడుపున పుట్టిన జీనియస్ అని నిరూపిస్తుంది. స్వతహాగా సింగర్ అయిన సుకృత తన తండ్రి పుట్టిన రోజు కానుకగా స్వయంగా ఓ పాట పాడి స్పెషల్ గిప్ట్ గా ఇచ్చింది. సుకృత అర్బన్ జామ్ విత్ అనే యూ ట్యూబ్ ఛానెల్ స్టార్ చేసింది. సుకృత మంచి సింగర్ లేదా తండ్రిలా డైరెక్టర్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

తేజ – ఐలా : ప్రేమకథా చిత్రాలకు ప్రసిద్ధిగాంచిన డైరెక్టర్ తేజ తన కొడుకు అమితోవ్ ని హీరోగా పరిచయం చేసే ఏర్పాట్లలో ఉన్నాడు. కాగా తేజ కూతురు ఐలా అమెరికాలో బిజినెస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ మాస్టర్స్ చేస్తుంది. ఐలా మంచి స్పీకర్ కాగా, అక్కడ బెర్కోలి ఫోరమ్ తరపున వ్యాఖ్యాతగా ఉపన్యాసాలు ఇస్తున్నారట. యువత తమ ఆలోచనలను బిజినెస్ వైపుగా మళ్లించి, జీవితంలో ఎదగాలని స్ఫూర్తి నింపుతున్నారట.

గుణశేఖర్ – నీలిమ, యుక్త : ఇక భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్ రానాతో హిరణ్యకశిప మూవీ చేయనుండగా దాని ప్రీ ప్రొడక్షన్ పనులు చూసుకుంటున్నారు. ఈయన ఇద్దరు కూతుళ్లు కూడా సినిమా రంగంలో రాణించాలనని ప్రణాళికలు వేస్తున్నారు. పెద్ద కూతురు నీలిమ రుద్రమ దేవి సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. చిన్న కూతురు యుక్త సినిమా మేకింగ్ కి సంబందించిన ఎదో ఒక విభాగంలో సెటిల్ కావాలని అనుకున్నారట.

వంశీ పైడిపల్లి – ఆద్య : డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూతురు ఆద్య చిన్న వయసులోనే మంచి స్పీకర్ అని నిరూపించుకున్నారు. ఆద్య మహేష్ కూతురు సితారతో కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు. ఈ చిచ్చర పిడుగులు ఏకంగా మహేష్ ని తమ ఛానెల్ ద్వారా ఇంటర్వ్యూ చేశారు. ఇకో వినాయకుడు వంటి సోషల్ అవేర్నెస్ కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. ఆద్య సైతం భవిష్యత్తులో సినిమా రంగంలో రాణించడం ఖాయం.

మారుతి – అభీష్ట : ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు మారుతి కూతురు అభీష్ట లేటెస్ట్ సూపర్ హిట్ ప్రతిరోజూ పండగే చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది.

రాజమౌళి – మయూఖ : దర్శకధీరుడు రాజమౌళి ఫ్యామిలీ అంటే అది ఒక సాంకేతిక నిపుణుల నిలయం అనాలి. ఆ ఫ్యామిలీలో అనేక క్రాఫ్ట్స్ కి చెందిన ఆర్టిస్ట్స్ ఉన్నారు. రాజమౌళి కూతురు మయూఖ బాహుబలి సినిమాలో కొన్ని సన్నివేశాలలో తళుక్కున మెరిసింది. 24 క్రాఫ్ట్స్ లో ఎదో ఒక విభాగంలో మయూఖ ముందుకు వెళ్ళనుందట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus