Ileana: ఇలియానా ఆ వ్యాపారంలోకి ఎంట్రీ ఇస్తారా..?

  • May 15, 2021 / 04:55 PM IST

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న ఇలియానాను ప్రస్తుతం టాలీవుడ్ దర్శకనిర్మాతలు పట్టించుకోవడం లేదు. ఇలియానా లుక్ పూర్తిగా మారిపోవడంతో పాటు బరువు పెరగడంతో ఆమెకు హిందీలో కూడా పెద్దగా ఆఫర్లు రావడం లేదు. స్టార్ డమ్ ను కోల్పోయిన ఇలియానా తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఎక్కువ సంఖ్యలో అవకాశాలు వస్తున్న సమయంలో టాలీవుడ్ కు గుడ్ బై చెప్పి బాలీవుడ్ కు వెళ్లారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ల నుంచి గట్టి పోటీ ఎదురవటం,

మంచి ఆఫర్లు రాకపోవడంతో అక్కడ ఇలియానా స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకోలేకపోయారు. బాలీవుడ్ లో సెకండ్ హీరోయిన్ రోల్స్ లోనే ఇలియానా ఎక్కువగా నటించడం గమనార్హం. అమర్ అక్బర్ ఆంటోని సినిమాతో టాలీవుడ్ లో ఇలియానా రీఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేయగా ఆ ప్రయత్నం బెడిసికొట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇలియానా చేతిలో ఒకటి రెండు ఆఫర్లు ఉన్నా ఆ ఆఫర్ల వల్ల ఆమె కెరీర్ కు పెద్దగా ఉపయోగం లేదని తెలుస్తోంది.

మరోవైపు లాక్ డౌన్ వల్ల ఇంటికే పరిమితం కావడంతో ఇలియానా వంటలక్కలా మారిపోయారు. ఇంట్లోనే వంటలు చేసిన ఇలియానా ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇలియానా తన కెరీర్ కు ప్రత్యామ్నాయం కుకింగ్ అని కామెంట్ పెట్టగా ఆ కామెంట్ పై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలియానా భవిష్యత్తులో హోటల్, రెస్టారెంట్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇస్తారా..? అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus